మరికొద్ది రోజుల్లో పెళ్లి.. బంధుమిత్రులతో సందడిగా మారిన ఇల్లు.. ఇంతలో వరుడు చేసిన పనికి అందరూ షాక్!

ABN , First Publish Date - 2022-01-31T17:26:26+05:30 IST

అతనికి పెళ్లి కుదిరింది.. ముహూర్తం దగ్గరపడింది.. షాపింగ్, పెళ్లి పనులు పూర్తయ్యాయి..

మరికొద్ది రోజుల్లో పెళ్లి.. బంధుమిత్రులతో సందడిగా మారిన ఇల్లు.. ఇంతలో వరుడు చేసిన పనికి అందరూ షాక్!

అతనికి పెళ్లి కుదిరింది.. ముహూర్తం దగ్గరపడింది.. షాపింగ్, పెళ్లి పనులు పూర్తయ్యాయి.. ఇంటికి బంధుమిత్రుల రాక కూడా మొదలైంది.. సందడిగా ఉండాల్సిన ఇల్లు వరుడు చేసిన పనితో విషాదంలో మునిగిపోయింది.. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో అందరూ షాకయ్యారు.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


రాయ్‌పూర్‌కు సమీపంలోని ధమతారి ప్రాంతానికి చెందిన నరేంద్ర సాహుకు పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 6వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పటికే పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. బంధుమిత్రులతో ఇల్లంతా కళకళలాడుతోంది. అలాంటి తరుణంలో వరుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఉదయం తన బెడ్రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం బెడ్రూమ్‌లోకి వెళ్లి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో నరేంద్ర తండ్రి కిటికీలో నుంచి చూశాడు. 


లోపల నరేంద్ర ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించిన బంధువులు నరేంద్రను హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. నరేంద్ర ఆత్మహత్యకు గల కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు.  



Updated Date - 2022-01-31T17:26:26+05:30 IST