చేనేతలకు సంక్షేమనిధి ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-08T05:21:24+05:30 IST

చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్షేమనిధి ఏర్పాటు చేసి అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర చేనేత జనసమాఖ్య జిల్లా అధ్యక్షుడు గుదిటి సుధాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చేనేతలకు సంక్షేమనిధి ఏర్పాటు చేయాలి
మదనపల్లెలో చేనేత కార్మికుల దినోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 7: చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్షేమనిధి ఏర్పాటు చేసి అన్ని విధాల ఆదుకోవాలని  రాష్ట్ర చేనేత జనసమాఖ్య జిల్లా అధ్యక్షుడు గుదిటి సుధాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  ప్రపంచ చేనేతకార్మికుల దినోత్సవాన్ని ఆదివారం నీరుగట్టువారిపల్లెలో చేనేతసంఘం నాయకులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌కాలనీ, వేంకటేశ్వరపురంలో  చేనేత మగ్గానికి పూజలు నిర్వహించారు. అనంతరం సుధాకర్‌ మాట్లా డుతూ చేనేతపరిశ్రమ చాలా దీనస్థితిలో నడుస్తోందని, కార్మికులకు ఉపాధిలేక ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజీలు అందించి ఆదుకోవాలని లేని పక్షంలో చేనేత కార్మికులు సంక్షోభంలో ఇర్కుంటారన్నారు. నేతన్న నేస్తం లబ్ధిదారులకు అందరికీ అందివ్వాలని కోరారు. చౌడేశ్వరీదేవి సర్కిల్‌లో చేనేత కార్మికుల సంఘం నాయకులు చేనేత కార్మికదినోత్సవాని నిర్వ హించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సిల్క్‌ సబ్సిడీలు ఇవ్వా లని, కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో  చేనేత సంఘం నాయకులు మోడెం నాగరాజు, సురేంద్ర రెడ్డి, రామిశెట్టి రామయ్య, దోండ్ల రామమూర్తి, నరసంహురెడ్డి, మంజునా థ, చెంగళరాయుడు, శ్రీరాములు   కార్మికులు పాల్గొన్నారు.  పట్టణంలో ని నీరుగట్టువారిపల్లెలో జనసేన పార్టీ  చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర చేనేతలను సన్మానించారు. 

తంబళ్లపల్లెలో: చేనేతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పద్మ శాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సురేంద్రనాథ్‌ అన్నారు. ఆదివారం తంబళ్లప ల్లెలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా తంబళ్లపల్లె చేనేత కార్మిలందరూ కలసి  ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంచిపెట్టారు. హరిత కూడలి వద్ద కేకు కట్‌ చేసి చేనేత కార్మికులకు, ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్‌ మాట్లాడుతూ...మండలంలోని చేనేత కార్మికులందరూ ఐకమత్యంతో ఉంటే త్వరలో క్లస్టర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పరుషతోపు సర్పంచ్‌ పార్వతమ్మ శ్రీనివాసులు, చేనేత కార్మికులు లక్ష్మయ్య, సాంబశివారెడ్డి, మణి, దేవేం ద్ర, నజీర్‌, విజయ్‌కుమార్‌నాయక్‌, శ్రీకాంత్‌రెడ్డి, మల్‌రెడ్డి, రేపన మల్లికా ర్జున, నరేష్‌, లోకేష్‌, ఆనంద్‌, శంకర్‌రెడ్డి, నరేంద్రనాయుడు పాల్గొన్నారు. 

ములకలచెరువులో: జాతీయ చేనేత దినోత్సవాన్ని ములకలచెరువులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. చేనేత సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో చేనేత కార్మికులు రాట్నానికి పూజలు చేసి అనంతరం కేక్‌న కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.  కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, భూపతి, రెడ్డెప్ప, అమర, శ్రీనివాసులు, రఫి, ఇస్మాయిల్‌, వెంకటరమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:21:24+05:30 IST