Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో..

Published: Tue, 09 Aug 2022 15:54:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో..

త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే తొందరలో కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు వాహనాలను వేగంగా నడుపుతూ తాము ప్రమాదానికి గురవడమే కాకుండా.. పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెడుతుంటారు. ఇంకొందరైతే కదులుతున్న వాహనాలను ఎక్కే క్రమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకు కలిసి కదులుతున్న రైలును (moving train) ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయలో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ (woman constable) గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది..

పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) బంకురా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు తన కొడుకుతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే వారు వెళ్లాల్సిన రైలు అప్పటికే కదిలేందుకు సిద్ధంగా ఉంది. ఎలాగైనా వెళ్లాలనే ఉద్దేశంతో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో రైలు వేగం మరింత పెరిగింది. అయినా బోగీలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వారిని గమనించి.. పరుగెత్తుకుంటూ వెళ్తుంది.  బోగీని పట్టున్న తల్లీకొడుకు అదుపుతప్పి.. ప్లాట్‌ఫామ్‌పై పడిపోతారు. మహిళా కానిస్టేబుల్.. వారిని పట్టుకుని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పుతుంది. మొత్తానికి తల్లీకొడుకు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళా కానిస్టేబుల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..videoInstagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో.. Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం.. Funny video: అందుకే దీన్ని గుడ్లగూబ అనేది.. రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను పసిగట్టి.. ఏం చేసిందంటే.. video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.