కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..

Published: Tue, 17 May 2022 09:15:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..

చాలా మందికి డబ్బు, కీర్తి ప్రతిష్టలపైనే కోరికలు ఉంటాయి. అదే వారి జీవిత ఆశయంగా బతుకుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు అలాంటి కోరికలేవీ లేవు. కోట్ల రూపాయలు వద్దు.. కనీసం ఒక్కసారి కూర్చుంటే చాలనేది ఆమె కోరిక. 30సంవత్సరాలుగా ఆమెకు ఇది తీరని కోరికగా మిగిలింది. కూర్చోవడం కోరిక ఏంటని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్య ఏంటో తెలిస్తే.. అయ్యో పాపం అని అంటారు.

కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..

పోలాండ్‌కు చెందిన జోవన్నా క్లిచ్‌ అనే యువతి ఓ అరుదైన సమస్యతో బాధపడుతోంది. ఆమె చిన్న వయసులో వెన్నెముక, కండరాల క్షీణత (spinal muscular atrophy)వ్యాధికి  గురైంది. అరుదైన జన్యుపరమైన సమస్య కారణంగా కేవలం నిలబడడం, లేదా పడుకోవడం తప్ప కూర్చోలేని పరిస్థితి. ’’చివరగా రెండేళ్ల వయసులో కూర్చున్నట్లు మా అమ్మ చెప్పింది... కానీ నాకు గుర్తులేదు’’.. అని యువతి చెబుతోంది. ప్రస్తుతం 30ఏళ్ల వయసున్న ఈమెకు.. కూర్చోవడమనేది తీరని కోరికగా మిగిలింది. 21ఏళ్ల వయస్సు వరకూ.. ఆమె సాధారణ జీవితాన్ని గడిపింది.  అయితే 2011లో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అప్పటి నుంచి నిలబడి ఉండేందుకు వీలుగా వీల్‌చైర్‌ను వినియోగిస్తోంది.

ఈ ఫొటోలోని అమ్మాయి వయసు ఎంతో ఊహించగలరా..? అసలు నిజం తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ప్రస్తుతం ఆమె కూర్చోవడానికి ఇబ్బందిపడడంతో పాటూ నడవడానికి కూడా సాధ్యం కావడం లేదు. వీల్‌చైర్‌ సాయంతోనే ఆమె ముందుకు కదలగలుగుతోంది. మోకాళ్లు మరింత బలహీనంగా మారడంతో రోజూ నొప్పితో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాధికి చికిత్స చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం ఫిజియోథెరపీ చికిత్స చేయించుకునేందుకు విరాళాలు సేకరించేందుకు GoFundMe అనే పేజీని ప్రారంభించింది. నెయిల్ టెక్నీషియన్‌గా బ్యూటీ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ఈ వ్యాధి కారణంగా రోజూ వివిధ సమస్యలతో సతమతమవుతోంది. చికిత్స చేయించుకునేందుకు దాతలు సహకరించాలని వేడుకుంటోంది.

ఒకే ఒక్క పొటాటో చిప్ పీస్ ధర ఏకంగా రూ.1.63 లక్షలు.. ఇంత ఖరీదేంటని ఆశ్చర్యపోతున్నారా..?

ఇవి కూడా చదవండిLatest News in Telugu

తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులుViral video: రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో.. videoచలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య దూసుకొచ్చిన భారీ ఇనుప బంతులు.. తీరా ఏంటా అని పరిశీలించగా.. Viral video: వావ్! ఈ కుక్క పిల్ల ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో మీరే చూడండి.. videoవదినపై ప్రేమతో భార్యను దూరం పెట్టాడు.. విషయం ఇంట్లో తెలియడంతో రోజూ గొడవలు.. ఓ రోజు అర్ధరాత్రి భార్య గదికి వెళ్లి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.