పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..

Published: Thu, 06 Jan 2022 16:26:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..ప్రతీకాత్మక చిత్రం

పెళ్లయిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా.. మహిళలు భర్తతో కలిసి ఉండేందుకే ఇష్టపడతారు. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న సమస్యలకే పుట్టింటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో పెద్దలు సర్దిచెప్పి పంపుతూ ఉండడం సహజమే. పెద్ద పెద్ద సమస్యలు తలెత్తినప్పుడు కొన్నిసార్లు విడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే చిన్న చిన్న కారణాలకు ఎవరూ భర్తను వదిలి వెళ్లరు. కానీ ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం చిన్న కారణం చూపుతూ పెళ్లయిన 11వ రోజే పుట్టింటికి వెళ్లింది. 11 ఏళ్లవుతున్నా భర్తతో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. చివరకు ఏం జరిగిందంటే..

ఛత్తీస్​గఢ్ జాంజ్‌గిర్‌కు చెందిన సంతోష్ సింగ్ అనే వ్యక్తికి 2010 జులైలో వివాహమైంది. అత్తగారింటికి వెళ్లిన నవ వధువు.. 11రోజుల వరకు సంతోషంగానే ఉంది. తర్వాత ఓరోజు ఆమె తల్లిదండ్రులు వచ్చి.. ముఖ్యమైన కార్యక్రమం ఉందనే కారణం చూపి కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లారు. కొన్ని రోజులు గడవగానే భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అయితే ముహూర్తం సరిగా లేదని, కొన్నాళ్ల తర్వాత పంపుతామని చెప్పడంతో వెనుదిరిగి వచ్చాడు. అనంతరం మరికొన్ని రోజులు గడవగానే మళ్లీ భార్య కోసం వెళ్లిన భర్తకు.. అదే సమాధానం వచ్చింది.

ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని..

కొన్ని నెలలు గడిచినా భార్య నుంచి ముహూర్తం సరిగా లేదంటూనే సమాధానం వస్తోంది. దీంతో సంతోష్ సింగ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 11 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ముహూర్తం సరిగా లేదంటూనే చెబుతుండడంతో తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. గత నెలలో విడాకులు మంజూరు చేసింది. ముహూర్తం పేరుతో విడాకుల వరకూ దారి తీసిన ఈ అంశం.. స్థానికంగా హాట్‌ టాపిక్ అయింది.

ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

బంధువు కావడంతో రోజూ స్నేహితుడి ఇంట్లోకి వెళ్లేవాడు.. అతడి భార్యకు దగ్గరై.. చివరకు వారు చేసిన నిర్వాకం..గుర్రంపై పెళ్లిమంటపానికి చేరుకున్న వరుడు.. రెండో అంతస్థులో వధువు.. కిటికీలోంచి చూసుకుని ఇద్దరి రియాక్షన్‌ను చూస్తే..videoఈ ఫొటోలో కనిపిస్తున్నది పురుషుడు కాదు.. మహిళ.. 43 ఏళ్లుగా గొంతు మార్చి మరీ మగాడిలా జీవనం.. కారణమేంటంటే..న్యూఇయర్ వేడుకల్లో పోలీసులు.. మందులోకి ముక్క లేదని వారు చేసిన పనికి గ్రామస్తులు షాక్.. చివరకుప్రజలు మద్యం తాగి రావణుడిలా ప్రవర్తిస్తున్నారంటూ.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.