ఈ ఫొటోలో వృద్ధురాలిగా కనిపిస్తున్న ఈమె వయసు కేవలం 25 ఏళ్లు.. ఎందుకు ఇలా అయిపోయిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-13T19:10:53+05:30 IST

కింది ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సోనియా.. చూడడానికి వృద్ధురాలిగా కనిపిస్తున్న ఈమె వయసు కేవలం 25 ఏళ్లు..

ఈ ఫొటోలో వృద్ధురాలిగా కనిపిస్తున్న ఈమె వయసు కేవలం 25 ఏళ్లు.. ఎందుకు ఇలా అయిపోయిందో తెలిస్తే..

పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సోనియా.. చూడడానికి వృద్ధురాలిగా కనిపిస్తున్న ఈమె వయసు కేవలం 25 ఏళ్లు.. భర్త క్రూరత్వం కారణంగా ఆమె పాతికేళ్లకే వృద్ధురాలిగా మారిపోయి ప్రాణాలతో పోరాడుతోంది.. అడిగినంత కట్నం తేలేదనే కారణంతో ఆమెను భర్త పెట్టిన టార్చర్ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలో ఉన్న రామాజీపుర గ్రామానికి చెందిన సోనియా గత నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. 


సోనియా 2018లో గుల్ఫామ్ ఖాన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహ సమయంలో గుల్ఫామ్ అడిగినంత కట్నం, ఒక బైక్‌ను సోనియా కుటుంబ సభ్యులు అందించారు. అయితే బైక్ అమ్మేసిన గుల్ఫామ్ తనకు కారు కావాలని పట్టుబట్టాడు. కారు కొనేంత డబ్బులు లేకపోవడంతో సోనియా తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. దీంతో సోనియాను గుల్ఫామ్ టార్చర్ చేయడం ప్రారంభించాడు. ఆమెను కొట్టేవాడు. రోజంతా ఇంట్లోని ఒక గదిలో పెట్టి తాళం వేసేవాడు. ఉదయం ఒక రెండు గంటల పాటు ఆమెను బయటకు తీసుకు వచ్చి ఇంటి పని చేయించేవాడు. అనంతరం ఆమెను గదిలో పెట్టి లాక్ చేసేవాడు. తను పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఆమెను ఓ రెండు గంటల బయటకు తీసుకొచ్చి ఇంటి పని చేయించేవాడు. అనంతరం ఆమెను గదిలో బంధించేవాడు. 


ఆమె తినడానికి రోజు మొత్తంలో ఓ బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే ఇచ్చేవాడు. ఇలా నాలుగేళ్లుగా జరుగుతున్నా ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. రోజంతా గదిలోనే ఉండాల్సి రావడం, పోషకాలు లేని బ్రెడ్ మాత్రమే తింటుండడం వల్ల ఆమెకు టీబీ సోకింది. శరీరమంతా వడలిపోయి వృద్ధురాలిలా అయిపోయింది. అయినా గుల్ఫామ్ ఆమెకు చికిత్స చేయించలేదు. ప్రస్తుతం ఆమెకు టీబీ చివరి దశలో ఉంది. ఇటీవల ఆమె తన తల్లి, చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం గుల్ఫామ్‌ను విచారిస్తున్నారు. 

Updated Date - 2021-12-13T19:10:53+05:30 IST