ఏడ్రోజులుగా ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు డౌట్.. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే ఇంట్లో షాకింగ్ సీన్.. ఇదేం పని అని అడిగితే..

ABN , First Publish Date - 2021-10-22T01:08:32+05:30 IST

ఏడు రోజులుగా ఎవరూ బయటకు రాకపోవడం.. మూసిన తలుపులు మూసినట్టే ఉండటంతో స్థానికులకు డౌట్ వొచ్చింది. ఆ ఇంట్లో ఏదో జరిగిందనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి కంగుతిన్నారు. ఇదేం పని అడగ్గా.. వాళ్లు చెప్పిన సమాధా

ఏడ్రోజులుగా ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు డౌట్.. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే ఇంట్లో షాకింగ్ సీన్.. ఇదేం పని అని అడిగితే..

ఇంటర్నెట్ డెస్క్: ఏడు రోజులుగా ఎవరూ బయటకు రాకపోవడం.. మూసిన తలుపులు మూసినట్టే ఉండటంతో స్థానికులకు డౌట్ వొచ్చింది. ఆ ఇంట్లో ఏదో జరిగిందనే ఉద్దేశంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి కంగుతిన్నారు. ఇదేం పని అడగ్గా.. వాళ్లు చెప్పిన సమాధానం విని షాకయ్యారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...



జార్ఖాండ్‌లోని గొడ్డా జిల్లాలో ఉన్న రాజేంద్ర నగర్ అనే ప్రాంతంలో ఓ ఇల్లు గత ఏడు రోజులుగా మూసే ఉంది. వారం రోజుల నుంచి ఆ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో అనే సందేహంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. స్థానికులు సహాయంతో ఇంటి తలపులు పగలగొట్టారు. అనంతరం ఆ ఇంట్లో భార్యభర్త సహా వారి అబ్బాయిని చూసి పోలీసులు షాకయ్యారు. ఈ క్రమంలోనే  ‘ఏడు రోజులుగా ఎందుకు బయటకు రావడం లేదు.. తలుపులు పగలగొడుతున్నా  ఉలుకూ పలుకూ లేకుండా ఎందుకు కూర్చుండిపోయారు’ అని ప్రశ్నించిన పోలీసులకు వారి దగ్గర నుంచి ఊహించని సమాధానం వచ్చింది. తన భార్య కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని.. ఈ క్రమంలోనే బయట అందరూ చనిపోతున్నారని భ్రమపడి తమను బయటకు రానివ్వకుండా అడ్డుకుందని సదరు మహిళ భర్త చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. తలుపులు పగలగొట్టే సమయంలో కూడా మాట్లాడనివ్వకుండా నోరు నొక్కిందని.. బయటి నుంచి వచ్చిన ఆహారంలో విషం కలిసిందని తన భార్య భావిస్తోందని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించిన తర్వాత కొద్ది రోజులపాటు బాగానే ఉందని.. ఈ మధ్యే మళ్లీ అదేవిధంగా ప్రవర్తించడం ప్రారంభించదని అతడు పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు అతడికి జాగ్రత్తులు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2021-10-22T01:08:32+05:30 IST