తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిపై కసి.. ఆమెను కిడ్నాప్ చేసి, నగ్నంగా మార్చి దారుణం..

ABN , First Publish Date - 2022-02-28T18:20:49+05:30 IST

వారికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.. భర్త వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు..

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిపై కసి.. ఆమెను కిడ్నాప్ చేసి, నగ్నంగా మార్చి దారుణం..

వారికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.. భర్త వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. భార్యను నిర్లక్ష్యం చేసి ప్రేయసితో తిరిగేవాడు.. ఆ విషయం తెలుసుకున్న భార్య దారుణంగా ప్రవర్తించింది.. భర్త ప్రేయసిని కిడ్నాప్ చేయించింది.. ఆమె బట్టలూడదీసి, చితక్కొట్టి, ఆమె జననాంగంపై కారం పూసింది.. అనంతరం చేతులు, కాళ్లు కట్టేసి నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయింది.. గుజరాత్‌లోని రాజ్‌కోట్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


రాజ్‌కోట్ ప్రాంతంలోని అవధ్‌ రోడ్డులో ఓ యువతి రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. తన ప్రియుడి భార్య కొట్టించిందని యువతి చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఇద్దరు యువకుల సాయంతో తన ప్రియుడి భార్య తనను కిడ్నాప్ చేయించిందని, ముగ్గురూ తనను చితకబాదారని చెప్పింది. 


అనంతరం తన జననాంగంపై కారం పూశారని, చేతులను, కాళ్లను తాళ్లతో కట్టేసి రోడ్డు పక్కన పడేసినట్లు బాధితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి ప్రియుడి భార్యను, ఆమెకు సహాకరించిన మరో ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-02-28T18:20:49+05:30 IST