Viral Video: కారు బానెట్‌పై ఇలా కూడా చేస్తారా..? ఓ మహిళ చేసిన పనికి నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్

ABN , First Publish Date - 2022-04-29T01:18:45+05:30 IST

ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘కారు బానెట్‌ను ఇలా కూడా ఉపయోగించొచ్చన్న విషయం ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది’ అం

Viral Video: కారు బానెట్‌పై ఇలా కూడా చేస్తారా..? ఓ మహిళ చేసిన పనికి నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘కారు బానెట్‌ను ఇలా కూడా ఉపయోగించొచ్చన్న విషయం ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది’ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే..



వేసవి కాలం కావడం వల్ల దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో ఒడిస్సాకు చెందిన మహిళ వినూత్నపనికి శ్రీకారం చుట్టింది.  సోన్పూర్ ప్రాంతానికి చెందిన మహిళ మరో మహిళతో కలిసి ఎండలో చపాతీలు తయారు చేసింది. అనంతరం వాటిని కారు బానెట్‌పై చక్కగా కాల్చింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘మహిళ ఎంతో శ్రమించి ఎండలో చపాతీలు చేస్తోంది. కానీ ఎండదెబ్బకు గురై ఆమె వాటిని తినలేదు’ అని కొందరు అభిప్రాయపడితే.. మరికొందరు మాత్రం.. ‘కారు బానెట్‌ను ఇలా కూడా ఉపయోగిస్తారా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-04-29T01:18:45+05:30 IST