మొబైల్ ఫోన్ కోసం మొదలైన గొడవ.. ఎక్కడి వరకు వెళ్లిందంటే..!

Jul 21 2021 @ 15:26PM

పక్క పక్క ఇళ్లలో నివసించే ఇద్దరు మహిళల మధ్య మొబైల్ ఫోన్ కోసం మొదలైన గొడవ చినికి చినికి గాలి వానగా మారింది. కొట్టుకునే స్థితి వరకు వెళ్లింది. ఆ తర్వాత ప్రాణం తీసే స్థితికి చేరింది. క్షణికావేశంలో పట్టరాని కోపంతో ఓ మహిళ తన పక్కింటి మహిళ గొంతు కోసి చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన తాజాగా కలకలం రేపింది. 


ఉత్తరప్రదేశ్‌లోని థానా గంజ్ ప్రాంతంలో నివసిస్తున్న తస్లిమా బేగమ్, రేష్మ మధ్య మొబైల్ విషయమై చిన్న వాగ్వాదం జరిగింది. రేష్మ తన మొబైల్‌లో పాటలు వింటుండగా.. తస్లిమా బేగమ్ కూతురి వల్ల పొరపాటున రేష్మ మొబైల్ నీటిలో పడింది. దీంతో ఆగ్రహం చెందిన రేష్మ.. తస్లిమాతో గొడవపెట్టుకుంది. ఫోన్ బాగు చేయించి ఇస్తానని తస్లిమా చెబుతున్నా వినకుండా రేష్మ గొడవకు దిగింది. క్షణికావేశంలో తస్లిమాపై కత్తితో దాడి చేసింది. దీంతో తస్లిమా గొంతు తెగడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో తస్లిమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రేష్మను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. తస్లిమా, రేష్మ మధ్య పాత గొడవలు కూడా ఏమైనా ఉన్నాయోమేనని ఆరా తీస్తున్నారు. మొబైల్ ఫోన్ కోసం మొదలైన గొడవ.. ఎక్కడి వరకు వెళ్లిందంటే..!

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...