ఎట్టకేలకు సోమాలియా నుంచి హైదరాబాద్‌కు చేరిన మహిళ

ABN , First Publish Date - 2021-04-12T13:54:28+05:30 IST

చదువు కోసం వచ్చిన సోమాలియా దేశస్థుడు నగర యువతిని వివాహమాడి, అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడు. విషయం ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌కు తెలియడంతో ఆయన విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లా

ఎట్టకేలకు సోమాలియా నుంచి హైదరాబాద్‌కు చేరిన మహిళ

హైదరాబాద్: చదువు కోసం వచ్చిన సోమాలియా దేశస్థుడు నగర యువతిని వివాహమాడి, అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడు. విషయం ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌కు తెలియడంతో ఆయన విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిత్వ శాఖ చొరవతో ఆ మహిళ ఎట్టకేలకు నగరానికి చేరింది. ఆమె నలుగురు సంతానంలో ఒక పాప మాత్రమే తనతో వచ్చింది. మిగతా ముగ్గురు పిల్లలను తీసుకొచ్చేలా సాయం చేయాలని ఆమె కోరుతోంంది. వివరాల్లోకి వెళితే.. సోమాలియా దేశానికి చెందిన ఓమర్ దాహిర్ ఫరాహ్ చెన్నైలో చదువుకునేందుకు వచ్చాడు. రాజేంద్రనగర్ శాస్త్రిపురం కాలనీకి చెందిన రహీమున్నీసాతో పరిచయం పెంచుకుని 2008 ఏప్రిల్ 3న పెళ్లి  చేసుకున్నాడు. నగరంలోనే పదేళ్లపాటు సంసారం సాగించిన అతను 2017లో రహీమున్నీసాను తన స్వదేశమైన సోమాలియాకు తీసుకెళ్లాడు.


అప్పటికే ఆమెకు ముగ్గరు సంతానం ఉండగా, అక్కడికి వెళ్లిన తర్వాత మరో సంతానం కలిగింది. రహీమున్నీసాను సోమాలియా తీసుకెళ్లిన ఓమర్ గ్రామీణ ప్రాంతంలో వదిలి వెళ్లాడు. అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు జరిగాయని.. సోమాలియాలో ఒకరిని, మహారాష్ట్రకు చెందిన మరొకరిని విహాసం చేసుకున్నాడని తెలిసి, రహీమున్నీసా షాక్‌కు గురైంది. ఆమె వద్దకు స్నేహితులను తీసుకుని వచ్చే ఓమర్ అక్కడ డ్రగ్స్ తీసుకొవడమే కాకుండా ఆమెను తీవ్రంగా వేధించసాగాడు. దీంతో ఆమె తన భాధను వివరిస్తూ గతేడాది ఓ వీడియో పంపించింది. స్పందించిన ఎంబీటీ నేత ఈ విషయాన్ని విదేశాంగ శాఖకు లేఖ ద్వారా వివరించారు. ఆమెను ఎట్టకేలకు రక్షించిన విదేశాంగ ఆమెను, ఆమె కూతురిని నగరానికి వచ్చేలా ఏర్పాటు చేసింది. 


Updated Date - 2021-04-12T13:54:28+05:30 IST