46 ఏళ్ల మహిళకు నెల నుంచి కడుపునొప్పి.. భరించలేక చివరకు ఆస్పత్రికి.. నోటి ద్వారా చిన్న కెమెరాను డాక్టర్లు పంపించి చూస్తే..

ABN , First Publish Date - 2022-07-25T23:00:04+05:30 IST

ఇండోర్‌(Indore) కు చెందిన ఆ మహిళ నెల రోజులుగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది..

46 ఏళ్ల మహిళకు నెల నుంచి కడుపునొప్పి.. భరించలేక చివరకు ఆస్పత్రికి.. నోటి ద్వారా చిన్న కెమెరాను డాక్టర్లు పంపించి చూస్తే..

ఇండోర్‌(Indore) కు చెందిన ఆ మహిళ నెల రోజులుగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది.. స్థానిక వైద్యులకు చూపించుకుని మందులు వాడింది.. అయినా కడుపు నొప్పి తగ్గలేదు.. దీంతో ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లింది.. అక్కడ స్కానింగ్ తీసిన వైద్యులు ఆమె కడుపులో హెయిర్ పిన్ (hair pin) ఉన్నట్టు తేల్చారు.. అది కడుపులో పలు ప్రాంతాల్లో గాయాలు చేసినట్టు కనుగొన్నారు.. ఎండోస్కోపీ సర్జరీ (Endoscopy surgery) చేసి ఆ హెయిర్ పిన్‌ను తొలగించారు. 


ఇది కూడా చదవండి..

రోడ్డు పక్కన చెత్త ఏరుకునే వ్యక్తికి కనిపించిందో పాలిథిన్ కవర్ మూట.. లోపల ఏముందా అన్న ఆశతో మూటను విప్పి చూస్తే..


ఇండోర్‌కు చెందిన రజియా (46) అనే మహిళ గత నెల రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతోంది. తమ సమీప ప్రాంతంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు వైద్యుల వద్దకు వెళ్లి మందులు వాడింది. అయినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. కడుపు నొప్పి తగ్గలేదు. రోజురోజుకూ పరిస్థితి దిగజారడంతో ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లింది. రజియాకు స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె కడుపులో హెయిర్ పిన్ ఉన్నట్టు తేల్చారు. అంతేకాదు ఆ పిన్ వల్ల కడుపులో పలు చోట్ల గాయాలు అయినట్టు గుర్తించారు. 


ఎండోస్కోపీ సర్జరీ చేసి ఆమె కడుపులోని హెయిర్ పిన్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంది. ఆమెకు ద్రవాహారం మాత్రమే ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కడుపులోని గాయాలు తగ్గిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మందులతో పాటు హెయిర్ పిన్‌ను కూడా మింగేసి ఉంటానని ఆ మహిళ చెబుతోంది. 

Updated Date - 2022-07-25T23:00:04+05:30 IST