ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రియురాళ్లట.. చివరకు ఈ ప్రియుడి పరిస్థితి ఎలా తయారయిందంటే..

ABN , First Publish Date - 2022-06-24T13:08:28+05:30 IST

ఈ రోజుల్లో ఒక గాళ్‌ఫ్రెండ్‌తోనే కొందరు సతమతమైపోతున్నారు. అడిగిందల్లా తెచ్చి ఇవ్వలేక చుక్కలు చూస్తున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం.. ఏక కాలంలో ముగ్గురు యువతులను ప్రేమించాడు. ఆ యువతులు కూడా ఇతడిని ఇష్టపడటంతో ఎగిరి గం

ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రియురాళ్లట.. చివరకు ఈ ప్రియుడి పరిస్థితి ఎలా తయారయిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ఒక గాళ్‌ఫ్రెండ్‌తోనే కొందరు సతమతమైపోతున్నారు. అడిగిందల్లా తెచ్చి ఇవ్వలేక చుక్కలు చూస్తున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం.. ఏక కాలంలో ముగ్గురు యువతులను ప్రేమించాడు. ఆ యువతులు కూడా ఇతడిని ఇష్టపడటంతో ఎగిరి గంతేశాడు. కానీ ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్ అయింది. చివరికి ముగ్గురు ప్రియురాళ్ల ఆ ముద్దుల ప్రియుడి పరిస్థితి ఎలా తయారైందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బిహార్‌లోని సమస్తీ‌పూర్‌కు చెందిన సత్యనారాయణ్ మెహతో అనే యువకుడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అయినా.. అతడు ముగ్గురు యువతులను ఇష్టపడ్డాడు. వాళ్లు కూడా ఇతడిని ఇష్టపడటంతో ఎగిరి గంతేశాడు. ముగ్గరు ప్రియురాళ్లతో జాలీగా గడపొచ్చని సంబరపడ్డాడు. అనుకున్నట్టే.. తొలుత వాళ్లతో సరదాగా గడిపాడు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గాళ్‌ఫ్రెండ్స్ ఖరీదైన గిఫ్ట్‌లు అడగటం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మొదట ఫ్రెండ్స్ దగ్గర చేబదులుకు కొత్త మొత్తాన్ని తీసుకుంటూ సత్యనారాయణ్ తన గాళ్‌ఫ్రెండ్స్ సరదాలు తీర్చేవాడు. అయితే తర్వాత స్నేహితులు కూడా అతడికి డబ్బులు ఇవ్వటం మానేశారు. 



దీంతో సత్యనారాయణ్ దొంగగా మారాడు. రోస్డా పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌లను దొంగతనం చేస్తూ.. వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో ప్రియురాళ్లకు ఖరీదైన గిఫ్ట్‌లు కొనివ్వడం ప్రారంభించాడు. అయితే.. పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో.. ప్రజల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. మరో దొంగతనానికి పాల్పడుతుండగా సత్యనారయణ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతడు తన తప్పును ఒప్పుకున్నాడు. తన గాళ్‌ఫ్రెండ్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌లు కొనిచ్చేందుకే వరుస దొంగతనాలకు పాల్పడినట్టు చెప్పాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు దాదాపు 12 బైకులను దొంగిలించినట్టు స్పష్టం చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన అధికారులు.. జైలుకు తరలించారు. 


Updated Date - 2022-06-24T13:08:28+05:30 IST