చెన్నై కుర్రాడి విన్యాసానికి.. guinness book వాళ్లే షాక్ అయ్యారు.. !

ABN , First Publish Date - 2021-10-07T02:44:06+05:30 IST

సాధారణంగా నాలుగు చక్రాల వాహనాలనే సరిగ్గా నడపలేక కొందరు.. ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అలాంటిది మూడు చక్రాల వాహనాన్ని, అందులోనూ రెండు చక్రాల మీద నడపడం అంటే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. చెన్నైలో ఓ యువకుడు ఈ విన్యాసాన్ని చేసి చూపించాడు.

చెన్నై కుర్రాడి విన్యాసానికి.. guinness book వాళ్లే షాక్ అయ్యారు.. !

విభిన్నమైన పనులు చేస్తూ చాలా మంది రికార్డు సృష్టిస్తూ ఉంటారు. తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతో వివిధ రకాల స్టంట్‌లు చేస్తుంటారు. అలాంటి వింతలను గిన్నిస్ బుక్ వాళ్లు నమోదు చేయడం సహజమే. అయితే చెన్నైలో ఓ యువకుడు చేసిన విన్యాసానికి గిన్నిస్ బుక్ వాళ్లే షాక్ అయ్యారు. అతడు చేసిన విన్యాసాన్ని అభినందిస్తూ... గిన్నిస్ బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 


సాధారణంగా నాలుగు చక్రాల వాహనాలనే సరిగ్గా నడపలేక కొందరు.. ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అలాంటిది మూడు చక్రాల వాహనాన్ని, అందులోనూ రెండు చక్రాల మీద నడపడం అంటే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. చెన్నైలో ఓ యువకుడు ఈ విన్యాసాన్ని చేసి చూపించాడు. చెన్నై నగరంలో జగతీష్ అనే ఆటో డ్రైవర్.. తన వాహనాన్ని రెండు చక్రాల మీద 2.2కిలోమీటర్లు నడిపి రికార్డు సృష్టించాడు. 


తనకు అందరిలా కాకుండా విభిన్నమైన పనులు చేయడమంటే ఇష్టమని.. ఈ క్రమంలోనే రెండు చక్రాల మీద ఆటో నడపడం అలవాటు చేసుకున్నానని తెలిపాడు. అయితే ఇది రికార్డు అవుతుందని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం కేవలం కిలోమీటర్ వరకు రెండు చక్రాలపై నడిపితే రికార్డు అవుతుంది. అయితే జగతీష్ ఆ రికార్డును అవలీలగా అధిగమించాడు. ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి.. నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఆటో డ్రైవర్.. రియల్ హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Updated Date - 2021-10-07T02:44:06+05:30 IST