ప్రేయసి బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్.. పొలాల్లోకి తీసుకెళ్లి మాట్లాడుకుంటుండగా ఊహించని సంఘటన.. చివరకు..

Jul 20 2021 @ 13:52PM

ప్రేయసి బర్త్‌డే‌కి గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. భారీగా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశాడు.. అనుకున్నట్టుగానే ప్రేయసి పుట్టిన రోజు నాడు ఆమె స్వగ్రామం చేరుకున్నాడు.. ఆమెను తీసుకుని పొలాల్లోకి వెళ్లాడు.. అయితే ఆ వూరి గ్రామస్తులు ఆ కుర్రాడికే షాకిచ్చారు.. వారిద్దరికీ అక్కడికక్కడే పెళ్లి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోపాల్‌పుర గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


కొత్వాలి గ్రామానికి చెందిన సత్యం తన ప్రేయసి జన్మదినోత్సవాన్ని జరిపేందుకు గత ఆదివారం ఆమె గ్రామానికి చేరుకున్నాడు. ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లాడు. వారిద్దరినీ జంటగా చూసిన గ్రామస్తులు ఊర్లోకి తీసుకొచ్చారు. ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. సమీప పోలీస్ స్టేషన్‌కు, సత్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇరు వర్గాల మధ్య వాదనలు, చర్చలు జరిగిన తర్వాత పెళ్లికి అబ్బాయి తరఫు వారు అంగీకరించారు. 


యువతి దళిత పేద కులానికి చెందినది కావడంతో అమె పెళ్లికి సహాయం చేసేందుకు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. దీంతో ఆదివారం వారిద్దరికీ పెళ్లి జరిగింది. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని అబ్బాయికి మంచం, ఫ్రిజ్, టీవీ తదితర సామాగ్రి కొనిచ్చారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...