Viral Video: రివేంజ్ అంటే అట్లుంటది మరి.. తనను కొట్టిన కుర్రాడిని ఈ గాడిద ఏం చేసిందో మీరే చూడండి!

ABN , First Publish Date - 2022-07-30T17:24:07+05:30 IST

గాడిద, ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో(Video) ప్రస్తుతం నెటింట వైరల్(Viral) అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కర్మ ఫలం ఇలానే ఉంటుంది’ అని కొందరు కామెంట్స్ చేస్తే.. ‘గాడిద రివేంజ్ అంటే అ

Viral Video: రివేంజ్ అంటే అట్లుంటది మరి.. తనను కొట్టిన కుర్రాడిని ఈ గాడిద ఏం చేసిందో మీరే చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: గాడిద, ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో(Video) ప్రస్తుతం నెటింట వైరల్(Viral) అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కర్మ ఫలం ఇలానే ఉంటుంది’ అని కొందరు కామెంట్స్ చేస్తే.. ‘గాడిద రివేంజ్ అంటే అట్లుంటది మరి’ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ సదరు వ్యక్తి చేసిన తప్పేంటి అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 



సుమారు 20ఏళ్ల వయసు  ఉన్న కుర్రాడు.. మూగజీవి అనే కనికరం కూడా చూపలేదు. గాడిద(Donkey)  పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు. పారిపోకుండా గాడిదను ఓ తాడుతో బంధించి.. ఇష్టం వచ్చినట్టు చితకొట్టాడు(Slaps) . తాను మనిషిని అన్న విషయాన్ని మరిచి.. కాలితో తన్నాడు( kicks). అనంతరం దానిపై ఎక్కి కూర్చున్నాడు. దాన్ని అదునుగా భావించిన ఆ గాడిద.. ఆ యువకుడిపై రివేంజ్ తీసుకుంది. కూర్చున్న వెంటనే అతడి కాలును తన నోటితో కొరికి పట్టుకుంది. అనంతరం అతడిని కింద పడేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-07-30T17:24:07+05:30 IST