పుట్టింట్లో ఉంటున్న భార్య నుంచి ఫోన్ కాల్.. ఆమె చెప్పింది విని ఘోరానికి పాల్పడిన భర్త.. ఇంతకీ అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-10-08T19:32:37+05:30 IST

అతడికి పెళ్లై రెండేళ్లయింది. ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటుంన్నారు. ఓ రోజు భార్య పుట్టింటికి వెళ్తానంటే అతడు సరేనని పంపించాడు. కొద్ది రోజుల తర్వాత భార్య అక్కడినుంచి భర్తకు ఫోన్ చేసింది. ఆమె చెప్పింది విని మనస్తాపానికి గురైన భర్త ఘోరానికి పాల్పడ్డాడు

పుట్టింట్లో ఉంటున్న భార్య నుంచి ఫోన్ కాల్.. ఆమె చెప్పింది విని ఘోరానికి పాల్పడిన భర్త.. ఇంతకీ అసలు కథేంటంటే..

అతడికి పెళ్లై రెండేళ్లయింది. ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటుంన్నారు. ఓ రోజు భార్య పుట్టింటికి వెళ్తానంటే అతడు సరేనని పంపించాడు. కొద్ది రోజుల తర్వాత భార్య అక్కడినుంచి భర్తకు ఫోన్ చేసింది. ఆమె చెప్పింది విని మనస్తాపానికి గురైన భర్త ఘోరానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఆమె ఫోన్ చేసి భర్తకు ఏం చెప్పిందంటే..


రాజస్థాన్‌లోని జగదాంబ నగర్‌కు చెందిన అమన్‌కు ఢిల్లీకి చెందిన మనీషతో జూలై 2019లో వివాహం జరిగింది. ఆ తర్వాత మనీష భర్తతో కలిసి  అత్తారింట్లోనే ఉంది. ఓ రోజు ఆమె తన పుట్టింటికి వెళ్తానంటే అతడు సరేనని పంపించాడు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజుల తర్వాత మనీష తన మనసు మార్చుకుంది. ఓ రోజు భర్తకు ఫోన్ చేసి ‘నువ్ కూడా ఢిల్లీకి వచ్చేయ్.. ఇక నుంచి మనం మా పుట్టింట్లోనే ఉందాం’ అని చెప్పింది. దానికి అమన్ నిరాకరించాడు. ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు. మనీష కుటుంబసభ్యులు కూడా అమన్‌‌ను ఢిల్లీకి రావాలని ఒత్తిడి చేశారు. అయినప్పటికీ అమన్ అత్తారింటికి వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో గొడవ పెద్దదై భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 18, 2021న మనీష భర్తకు ఫోన్ చేసింది. అదే విషయంపై ఫోన్‌లో వారిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన అమన్ తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న కర్ధని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు.


అయితే బాధితుడి తండ్రి నరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తన కొడుకు గదిలో సూసైడ్ నోట్ లభ్యమైందని అందులో ‘‘నేను కేవలం నా అత్తింటివారి వేధింపుల వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాను. నా భార్య తన తల్లిదండ్రులు చెప్పినట్లుగా విని, వాళ్ల మాటలే నమ్ముతుంది. కానీ నేను నా భార్య కోసం నా జీవితాన్నే అంకితం చేశాను. అమ్మా, నాన్న మీరు నాకోసం బాదపడొద్దు’’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడని అన్నారు. అపుడు పోలీసులు సూసైడ్ నోట్ చూసి తన దగ్గరే పెట్టుకోమన్నారని, తదుపరి విచారణలో తాము దాన్ని తీసుకుంటామని చెప్పినట్లు నరేంద్ర తెలిపాడు. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ నెల 6న పోస్ట్ ద్వారా మళ్లీ  ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని నరేంద్ర వాపోయాడు. తన భార్య, అత్తమామల వల్లే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడని ఆరోపిస్తూ బాధితుడి తండ్రి కోర్టులో పిటిషన్ వేశాడు. అపుడు కోర్టు కేసును విచారించమని ఏఎస్ఐ ప్రహ్లద్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-10-08T19:32:37+05:30 IST