Viral Video: జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..

Published: Thu, 19 May 2022 09:46:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..

సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఇందులో కొందరు విజయవంతమవుతుంటే.. మరికొందరు విఫలమవుతుంటారు. చివరకు అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూస్తాడు. అయితే చివరికి అతడి అంచనాలు తలకిందలవుతాయి..

ట్విటర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని సుసాంగ్ కౌంటీలోని జియుజింగ్‌గౌ ప్రాంతంలోని జలపాతం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జలపాతం వద్ద చాలా మంది సందర్శకులు సేదతీరుతూ ఉంటారు. అదే సమయంలో ఓ యువకుడు జలపాతం పైన విన్యాసం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా అదుపుతప్పి పైనుంచి నీటిలో వేగంగా కిందకు పడిపోతాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నీటితో పాటూ వేగంగా కిందకు జారుకుంటూ వచ్చిన యువకుడు.. ఓ నీటి గుంతలో పడిపోతాడు. తర్వాత అక్కడున్న వారు అతన్ని కాపాడి, బయటికి తీసుకొస్తారు. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడతాడు. గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఇక నుంచి తప్పు చేయనంటూ భార్యను నమ్మించాడు.. మరుసటి రోజు రాత్రి అన్నతో పాటూ భార్య గదికి వెళ్లి.. పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను మర్నాడు ఓపెన్ చేసి చూసిన వరుడికి దిమ్మతిరిగే షాక్.. ఆ గిఫ్ట్‌ను ఇచ్చిందెవరో తెలిసి..ప్లాస్టిక్ డ్రమ్ము నిండా కాంక్రీట్.. సుత్తితో పగలగొడితే కనిపించిన దృశ్యం చూసి అందరికీ మైండ్ బ్లాక్.. ఇదేం పని అని నిలదీస్తే..అమ్మాయిలా ప్రవర్తిస్తున్నావంటూ హేళన చేస్తున్న ఫ్రెండ్స్.. వాళ్లను పార్టీకి పిలిచి మరీ ఆ ఇంటర్ కుర్రాడు చేసిన దారుణమిదీ..! Viral Video: ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి.. videoవేర్వేరుగా ఉంటున్న తల్లిదండ్రులను కలపాలని కుమారుడి తపన.. అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో చివరకు అతడు చేసిన పని..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.