పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..

Published: Fri, 19 Aug 2022 21:10:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..ప్రతీకాత్మక చిత్రం

ఆ యువకుడు పెళ్లయిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. చివరకు ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆమె తన భర్తకు తెలీకుండా యువకుడితో కలుస్తూ ఉండేది. ఇటీవల ఏకంగా ఆమెను బైకుపై ఎక్కించుకుని పరారయ్యాడు. ఊరు దాటిన కాసేపటికి స్నేహితుడికి ఫోన్ చేసి, విషయం తెలియజేశాడు. ఫోన్ పెట్టేసిన కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కర్ణాటక (Karnataka) రాష్ట్రం బళ్లారి (Bellary) పరిధి దావణగెరె జిల్లా బెంకికెరె గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చరణ్ అనే వ్యక్తి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇతడికి సమీపంలో ఉంటున్న నాగరత్న అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాగరత్నకు భర్త, పిల్లలు ఉన్నారు. అయినా ఇంట్లో తెలీకుండా యువకుడితో కలుస్తూ ఉండేది. ఇటీవల వీరి వ్యవహారం మహిళ భర్తకు తెలిసింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. కొన్నాళ్లు దూరంగా ఉన్న ఇద్దరూ తర్వాత మళ్లీ కలుసుకోవడం ప్రారంభించారు.

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..

చివరకు, ఎలాగైనా కలిసి జీవించాలని లేదా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి ఆమెను తీసుకుని బైకులో దావణగెరె జిల్లాలోని బెంకికెరె గ్రామ సమీపంలోకి చేరుకున్నాడు. స్నేహితుడికి ఫోన్ చేసి, మేము చనిపోతున్నాం.. అని చెప్పి పెట్టేశాడు. కంగారపడ్డ అతను విషయాన్ని అందరికీ తెలియజేశాడు. అంతా అక్కడికి వెళ్లేసరికి.. ఇద్దరూ చెరువులో శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Wife Killed Husband: భర్తను చంపి బాత్రూంలోనే మృతదేహాన్ని రెండ్రోజుల పాటు దాచిన భార్య.. వాసన వస్తోందని ఆమె చేసిన పనితో..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..Viral Video: ఓ వైపు వర్షం.. మరో వైపు వరద.. మధ్యలో నడి రోడ్డుపై ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడో చూడండి..videoAttack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని.. గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.