అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణం

Published: Tue, 21 Jun 2022 16:54:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణం

ఆడపిల్లలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట బాలికలు, యువతులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రేమ పేరుతో నమ్మించి, చివరకు మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మోసపోయామని తెలుసుకున్న యువతులు.. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రం పాట్నాలో ఇలాంటి ఘటనే జరిగింది. అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ ఓ 28ఏళ్ల యువతి బలవర్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే..

అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణం

జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందిన ఉషా రాణి(28).. బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఎయిమ్స్‌లో నర్సుగా పని చేస్తోంది. బృందావన్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కంగారుగా ఇంటికొచ్చిన కూతురు.. ఏడుస్తూ.. అమ్మా!.. ఊరి బయట పొలంలో... అంటూ ఆమె చెప్పింది విని..

అందులో.. ‘‘సారీ మా, క్షమించండి బాబా, నా మరణానికి కారణం శీతల్ టోప్పో కుమారుడు అమిత్ టోప్పో మాత్రమే’’.. అని రాసి ఉంది. అమిత్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం కారణంగా ఉషా రాణి.. ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉష తండ్రి విల్చస్ లక్రాకు సమాచారం అందించారు. యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా?.. లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా?.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

బస్సు డ్రైవర్‌ను ప్రేమించిన యువతి.. కొన్నాళ్లకు తన జీవితంలోకి ఎంటరైన మరో వ్యక్తి.. చివరికి రెండో ప్రేమికుడితో కలిసి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

వాయిస్ బాగుందని యువతిని తన భజన బృందంలో చేర్చుకున్నాడు.. ఓ రోజు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు.. ఆరు నెలల తర్వాత చూస్తే..వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ చివరకు ఒకే ఒక్క కారణంతో..భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. ఇంటికి వెళ్లాక అనుమానంతో రహస్యంగా ఆమె వాట్సప్ చాటింగ్‌ను చూసిన భర్తకు..అవును.. 19 ఏళ్ల నా కూతుర్ని నేనే చంపేశా.. కానీ ఆమె మేలు కోరే చేశానంటూ.. ఓ తల్లి వింత వాదన వెనుక కథేంటంటే..16 ఏళ్ల కూతురికి రహస్యంగా పెళ్లి చేసిన తల్లి.. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమేంటో సీసీటీవీలో రికార్డవడంతో..నదిలోకి దూకేసిన ప్రేయసికి భారీ షాక్.. చచ్చేందుకు వచ్చిన ప్రియుడు ఎస్కేప్.. ఈదుకుంటూ బయటికొచ్చి ఆమె ఏం చేసిందంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.