Advertisement

వరద కాలువలో యువతి గల్లంతు

Oct 21 2020 @ 01:21AM

కమ్మర్‌పల్లి, అక్టోబరు 20: వరద కాలువలో దూకడంతో యువతి గల్లంతు అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన 18 ఏళ్ల అంజలి అనే యువతికి మతిస్థిమితం లేదు. ఇంటి సమీపంలో వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు అటువైపు పరుగెత్తడంతో కు టుంబీకులు ఆపారు. సోమవారం సాయంత్రం కూడా కాలువ వైపు పరుగెత్తి దూకింది. చెల్లెలు వెంట పరుగెత్తినప్పటికీ కాపాడలేకపోయాయని శ్రీను ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహ్మద్‌ ఆసీఫ్‌ తెలిపారు. యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.