ఈ అమ్మాయి పియానో వాయించి.. తన తాత సమస్యను ఎలా పొగొట్టిందో చూడండి..!

ABN , First Publish Date - 2021-11-01T01:22:17+05:30 IST

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. శ్రావ్యమైన సంగీతానికి జంతువులు కూడా స్పందిస్తాయని విన్నాం. అందుకే మానసిక జబ్బుల విషయంలో వైద్యులు కూడా సంగీతం వినమని సలహా ఇస్తుంటారు. కాళ్లు లేని వారికి కాళ్లు రావడం, మాట రాని వారికి

ఈ అమ్మాయి పియానో వాయించి.. తన తాత సమస్యను ఎలా పొగొట్టిందో చూడండి..!

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. శ్రావ్యమైన సంగీతానికి జంతువులు కూడా స్పందిస్తాయని విన్నాం. అందుకే మానసిక జబ్బుల విషయంలో వైద్యులు కూడా సంగీతం వినమని సలహా ఇస్తుంటారు. కాళ్లు లేని వారికి కాళ్లు రావడం, మాట రాని వారికి సంగీతం ద్వారా మాట రావడం.. సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ యువతి సంగీత ప్రావీణ్యంతో తన తాతకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధినే పోగొట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


షీలా అనే ఓ యువతికి పియానో వాయించడం అలవాటు. ఆమెకు 93 ఏళ్ల తాతయ్య ఉన్నారు. ఆయన అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో వారిని కూడా గుర్తుపట్టలేడు. ప్రతి సారీ ఆయనకు గుర్తు చేస్తూ ఉండాలి. ఆయన గదిలోకి వెళ్లి రోజూ యువతి పియానో వాయిస్తూ ఉండేది. ఓ రోజు తాత ఇది గమనించి తలుపు తీసి లోపలికి వస్తాడు. లోపల పియానో వాయిస్తున్న మనువరాలిని చూస్తాడు. కానీ గుర్తుపట్టలేక.. వేరే వాళ్ల గదికి వచ్చానేమో అనుకుని వెనక్కు వెళ్లబోతాడు. తర్వాత మళ్లీ లోపలికి వచ్చి నా పియానో వాయిస్తున్నది ఎవరబ్బా.. అనుకుంటూ కొద్ది సేపు గమనిస్తాడు. తర్వాత ఆయనకు.. మనువరాలు అనే విషయం గుర్తొచ్చి.. వాహ్.. సూపర్ అంటూ థంబ్ సింబల్ చూపిస్తాడు.


తాత తనను గుర్తుపట్టడంతో ఆ యువతి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పాటూ ‘‘జీవితం చాలా చిన్నది.. మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి’’.. అంటూ సందేశాన్ని జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. తాత హృదయంతో పాటూ అందరి హృదయాలను గెలుచుకున్నావు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Updated Date - 2021-11-01T01:22:17+05:30 IST