Aakash BYJU's: బాలికల సాధికారత కోసం ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆకాశ్ బైజూస్

ABN , First Publish Date - 2022-10-07T00:47:09+05:30 IST

టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్ధ ఆకాష్‌ బైజూస్‌(Aakash BYJU's) తమ ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం

Aakash BYJU's: బాలికల సాధికారత కోసం ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆకాశ్ బైజూస్

నెల్లూరు:  టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్ధ ఆకాష్‌ బైజూస్‌(Aakash BYJU's) తమ ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం ద్వారా నీట్‌, జెఈఈ కోచింగ్‌‌ను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన  విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు లబ్ధి పొందవచ్చు. విద్యార్థులను ఎంపిక చేసేందుకు ANTHE పేరుతో నవంబరు 5–13 తేదీలలో దేశ వ్యాప్తంగా 285 కేంద్రాలలో ఆన్‌‌లైన్‌లో నిర్వహిచబోతుంది. మెరుగైన ప్రతిభను కనబరిచిన విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఈ మేరకు ఆకాష్ బైజూస్ (Aakash BYJU's) అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్స్ సి. శ్రీనివాస్ రెడ్డి,  బ్రాంచ్ మేనేజర్ బీ సందీప్, అకడమిక్ హెడ్-మెడికల్ బీ అనిల్ వెల్లడించారు.


ఈ ప్రవేశ పరీక్షపై ఆకాష్‌ బైజూస్‌(Aakash BYJU's) డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ నీట్‌, జేఈఈ పరీక్షలలో సత్తా చాటాలని  కోరుకుంటున్నప్పటికీ ఆర్థక పరమైన అవరోధాల కారణంగా ప్రతికూలతలు ఎదురవుతున్న విద్యార్ధులకు తోడ్పడేందుకు ఈ స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ANTHE ప్రారంభమైన నాటి నుంచి 33 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించినట్టు చెప్పారు. నవంబర్‌ 5, 13 తేదీ రెండు సెషన్‌లుగా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్‌, మెడిసన్‌లలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. మల్టీపుల్‌ ఛాయిస్‌ రూపంలో 90 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.

Updated Date - 2022-10-07T00:47:09+05:30 IST