Neet కోసం సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్.. దేశంలోని తొలిసారి సమగ్ర ఆడియో బుక్‌ను రిలీజ్ చేసిన Aakash+Byju's

ABN , First Publish Date - 2022-07-07T22:26:46+05:30 IST

దేశంలో అగ్రగామి టెస్ట్‌ ప్రిపరేటరీ సేవల సంస్థ ఆకాష్‌+బైజూస్‌ ఇప్పుడు ఆకాష్‌ ఆడిప్రిప్‌ (AudiPREP)ను పరిచయం

Neet కోసం సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్.. దేశంలోని తొలిసారి సమగ్ర ఆడియో బుక్‌ను రిలీజ్ చేసిన Aakash+Byju's

న్యూఢిల్లీ:  దేశంలో అగ్రగామి టెస్ట్‌ ప్రిపరేటరీ సేవల సంస్థ ఆకాష్‌+బైజూస్‌ ఇప్పుడు ఆకాష్‌ ఆడిప్రిప్‌ (AudiPREP)ను పరిచయం చేసింది. నీట్‌ (NEET) అభ్యర్థులకు ఇది మొట్టమొదటి సమగ్రమైన ఆడియో బుక్‌ కావడం గమనార్హం. ఇందులో  సౌండ్‌ మాడ్యులేషన్‌తో పాటు స్పష్టమైన ఉచ్ఛారణ, అత్యున్నత నాణ్యత కలిగిన ఆడియో కంటెంట్‌ ఉంది. 


నిష్ణాతులైన ఫ్యాకల్టీ నేతృత్వంలో దీనిని తీర్చిదిద్దారు. నీటీ–గ్రీటీ బోధనాంశాల వారీగా గత సంవత్సరపు ప్రశ్నలు సంబంధిత అంశాలకు తగినట్లుగా వరుస క్రమంలో ఉంటాయి. అలాగే, అతి సులభమైన పద్ధతిలో  కాన్సెప్ట్‌లను మెమరైజ్‌ చేసుకునేందుకు శక్తివంతమైన నిమోనిక్స్‌ కలిగి ఉంది. డయాగ్రమ్స్‌, టేబుల్స్‌, ఫ్లో ఛార్ట్‌లను పూర్తి స్ధాయిలో అర్థం చేసుకులా సవివరణమైన వివరణ ఉంది. అతి ముఖ్యమైన నీట్‌ కాన్సెప్ట్‌లను ఎస్‌సీఆర్‌ఈటీ సిలబస్‌కు ఆవల సైతం కవర్‌ చేస్తూ కంటెంట్‌ రూపొందించారు.


సెల్ఫ్‌ ఎస్సెస్‌మెంట్‌ కోసం ఇంటరాక్టివ్‌ క్విక్‌ క్విజ్జెస్, ప్రతి చాప్టర్‌ చివరలో వేగవంతంగా రీక్యాప్‌ చేసుకునేందుకు అవకాశం, ఫార్ములా చార్ట్‌ చాప్టర్‌లో పలు అతి ముఖ్యమైన ఫార్ములాలను గుర్తుంచుకునేలా ప్రతి అధ్యాయం ముగింపు వేళ ముఖ్యమైన సూత్రాల పునశ్చరణ ఈ ఆడిడ్రిప్‌లో ఉంది.


వినూత్నమైన వెబ్‌, యాప్‌ ఆధారిత ఆడియోబుక్‌ ఆకాష్‌ ఆడిప్రిప్‌. దీనిలో  శాస్త్రీయంగా తీర్చిదిద్దిన స్టడీ మెటిరియల్స్‌‌తో కూడిన పొడ్‌కాస్ట్స్ ఉంటాయి.  ఈ ఆడియోబుక్‌లో  ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ కరిక్యులమ్‌కు సంబంధించి పూర్తి అంశాలు ఉంటాయి. క్లాస్‌ 11, క్లాస్‌ 12 విద్యార్థులకు ఇవి పూర్తి ఉపయుక్తంగా ఉండటం వల్ల మెడికల్‌ ప్రవేశ పరీక్షను వారు సులభంగా అధిగమించగలుగుతారు. 


ఆడిప్రిప్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆకాష్‌+బైజూస్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ.. ఆడిప్రిప్‌ మరో విప్లవాత్మక ఉపకరణంగా ఉండటంతో పాటు నీట్‌ ఔత్సాహికులకు అదనపు ఎడ్జ్‌ను అందిస్తుందన్నారు. ఈ సమగ్రమైన ఆడియోబుక్స్‌  అత్యున్నత నాణ్యత కలిగిన స్టడీ మెటీరియల్స్‌ను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తీర్చిదిద్దినట్టు చెప్పారు. 


ఇది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైనట్టు పేర్కొన్నారు. ఆడియో రికార్డింగ్‌ల ద్వారా  వినడం వల్ల మల్టీ సెన్సరీ లెర్నింగ్‌ సామర్థ్యం సైతం పెరుగుతుందని వివరించారు. ఆడిప్రిప్‌ ఇప్పుడు ఆకాష్‌ +బైజూస్‌ క్లాస్‌ 11, 12 విద్యార్థులకు మరీ ముఖ్యంగా నీట్‌ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు పూర్తి ఉచితంగా లభిస్తుంది.

Updated Date - 2022-07-07T22:26:46+05:30 IST