ఆలూ బాల్స్‌

ABN , First Publish Date - 2020-08-29T20:27:33+05:30 IST

బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, పసుపు - కొద్దిగా, కారం - పావు టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు

ఆలూ బాల్స్‌

కావలసినవి: బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, పసుపు - కొద్దిగా, కారం - పావు టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట. 


తయారీ: ముందుగా బంగాళదుంపలు ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. తరువాత అందులో పచ్చిమిర్చి, పసుపు, కారం, గరంమసాల, జీలకర్ర పొడి, బియ్యప్పిండి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు అర చేతులకు కొద్దిగా నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి. ఈ బాల్స్‌ను పొంగణాల పాన్‌లో వేసి మూత పెట్టి ఉడికించాలి. కాసేపయ్యాక బాల్స్‌ను తిప్పుకొని రెండో వైపు ఉడికించాలి. వీటిని చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.





Updated Date - 2020-08-29T20:27:33+05:30 IST