ఆమిర్ ఖాన్ వారసుడు.. ‘మహారాజా’

Jun 9 2021 @ 11:01AM

సినీ ఇండ‌స్ట్రీలో వార‌సుల ఎంట్రీ కొత్తేం కాదు. ఈ లిస్టులో మ‌రో స్టార్ హీరో వార‌సుడు చేరుతున్నాడు. అత‌నెవ‌రో కాదు..జునైద్ ఖాన్‌. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ త‌న‌యుడే ఈ జునైద్‌. సిద్ధార్థ్ పి.మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రానికి మ‌హారాజా అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మంగళవారం సెట్స్ పైకి వెళ్లింది. కొవిడ్ సెకండ్ వేవ్ లాక్‌డౌన్ నుంచి షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చిన నేప‌థ్యంలో మ‌హారాజా షూటింగ్ షురూ అయ్యింది. 1862 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో జునైద్ ఖాన్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.