Advertisement

షూటింగ్‌లో గాయపడ్డ ఆమిర్‌ఖాన్‌..!

Oct 19 2020 @ 15:25PM

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఖాన్‌ త్రయంలో ఒకరైన ఆమిర్‌ఖాన్‌ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే .. ప్రస్తుతం ఆమిర్‌, కరీనాకపూర్‌ కలిసి నటిస్తోన్న చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్‌ గంప్‌కు ఇది రీమేక్‌. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయ్యింది. ఢిల్లీ షూటింగ్‌ జరుగుతుండగా ఆమిర్‌ గాయపడ్డట్లు సమాచారం. పక్కటెముకకు గాయమైనప్పటికీ ఆయన పెయిన్‌ కిల్లర్‌ తీసుకుఇ షూటింగ్‌ కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తునాయి. విజయ్‌ సేతుపతి కూడా ఇందులో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.