
అహ్మాదాబాద్: నిరంతరాయ విద్యుత్ ఇచ్చేంత వరకు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని గుజరాత్ రైతులకు ఆప్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమయాన్ని తగ్గించడంపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, లేదంటే రైతులతో కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించింది.
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ నేత సాగర్ రెబారీ మాట్లాడుతూ ‘‘రైతులకు నేను పిలుపునిస్తున్నాను. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ వచ్చే వరకు ఎవరూ విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు. విద్యుత్ కంపెనీల అధికారులెవరనీ మీ ఇంటికి కానీ వ్యవసాయ బావుల వద్దకు కానీ రానివ్వకండి. మీ విద్యుత్ కనెక్షన్ తొలగిస్తే మాకు చెప్పండి. మేము పునరుద్దరిస్తాం. ప్రభుత్వంతో పోరాటానికి ఎంత వరకైనా వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.
గుజరాత్లో ఇప్పటికి అమలులో ఉన్న ఎనిమిది గంటల విద్యుత్ సరఫరాను ఆరు గంటలకు తగ్గించారు. గతంలో ఇది 16 గంటలు ఉండేది. అయితే 2003లో అప్పటి ప్రభుత్వం ఎనిమిది గంటలకు తగ్గించింది.
ఇవి కూడా చదవండి