హర్యానా వైపు చూసేంత ధైర్యం ఆప్‌కు లేదు: సీఎం ఖట్టర్

ABN , First Publish Date - 2022-04-04T18:49:40+05:30 IST

ఆప్‌ ద్వంద ప్రమాణాలతో ఉంది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే చండీగఢ్‌ అంశాన్ని లేవనెత్తారు. పంజాబ్ ఆప్‌కు ఇలాంటి ఆదేశాలు ఎవరు ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

హర్యానా వైపు చూసేంత ధైర్యం ఆప్‌కు లేదు: సీఎం ఖట్టర్

చండీగఢ్: వివాదాలతో హర్యానాలోకి రావాలనుకుంటే సాధ్యం కాదని, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఒప్పుకోరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధానిపై రగడ తీవ్రమవుతోంది. చండీగఢ్‌ను తమకే ఇచ్చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ డిమాండ్ చేస్తుండగా.. కావాలని వివాదాలు సృష్టించవద్దంటూ హర్యానా హెచ్చరిస్తున్నారు.


ఈ విషయమై ఖట్టర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఆప్‌ ద్వంద ప్రమాణాలతో ఉంది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే చండీగఢ్‌ అంశాన్ని లేవనెత్తారు. పంజాబ్ ఆప్‌కు ఇలాంటి ఆదేశాలు ఎవరు ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వారు ఎత్తులు వేసినా హర్యానా వైపు చూడలేరు. ఇక్కడి ప్రజల నుంచి వారికి ఆదరణ దొరకదు. తొందరలోనే పంజాబ్ ప్రజలు కూడా ఆప్ నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారు’’ అని అన్నారు.

Updated Date - 2022-04-04T18:49:40+05:30 IST