తెలంగాణపై ఆప్ ఫోకస్.. ఏప్రిల్ 14 నుంచి పాదయాత్ర

ABN , First Publish Date - 2022-03-16T02:10:23+05:30 IST

తెలంగాణలో ఉన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతోందని ఢిల్లీ ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి..

తెలంగాణపై ఆప్ ఫోకస్.. ఏప్రిల్ 14 నుంచి పాదయాత్ర

న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతోందని ఢిల్లీ ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపడతామని పేర్కొన్నారు. ఆప్ పథకాలను ఇంటింటికి తీసుకెళ్తామన్నారు. తొలగించిన ఫెల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం కట్టించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని, వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని మండిపడ్డారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఈ అంశంపై మాట్లాడలేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం ఆప్ పోరాడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులను సీఎం కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని కేంద్రానికి లేఖ రాశామని సోమనాథ్ భారతి పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-16T02:10:23+05:30 IST