
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో రాణించి లోక్‌సభలో ఎక్కువ సీట్లు సాధించాలంటే ఏదైనా రాజకీయ పార్టీ జాతీయంగా విస్తరించి ఉండాలని, అలా ఎదగడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకో 15-20 ఏళ్లు పట్టొచ్చని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రస్తుత తరుణంలో దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే అది సాధ్యమని, మరే పార్టీకి ఇప్పట్లో దేశ వ్యాప్తంగా ప్రభావం చూపడం కష్టమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
మొన్నటి ఎన్నికల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా అన్నా ప్రశ్నకు ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ‘‘లోక్‌సభ ఎన్నికల్లో రాణించాలంటే దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్ బ్యాంక్ కావాలి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ కేవలం 27 లక్షల ఓట్లు మాత్రమే సాధించింది. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్, బీజేపీలకు మాత్రమే ఉంది. మరే ఇతర పార్టీయైనా ఆ స్థాయికి ఎదగొచ్చు. అయితే దానికి సమయం పడుతుంది. ఆప్ ఇదే స్పీడును కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా వెళ్తే మరో 15-20 ఏళ్లలో ఆ స్థాయికి వెళ్లొచ్చు. కానీ రాత్రికి రాత్రే అది సాధ్యం కాదు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
పంజాబ్‌లో ఆప్‌కు రాత్రికి రాత్రే విజయం రాలేదని ముందు నుంచి వ్యూహాత్మకంగా పని చేసిందని, దానితో పాటు 2014 లోక్‌సభ ఎన్నికల సమయం నుంచే పంజాబ్‌లో పార్టీకి బలంగా ఉందని అది ఈ ఎన్నికల నాటికి అధికారాని వచ్చిందని తెలిపారు. 2023లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీలో ఉంటుందని, అక్కడ పెద్దగా ప్రభావం చూపకపోచ్చని ఆయన అన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పూర్తిగా ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని, బీజేపీ అసలు పోటీలోనే లేదని, కానీ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో పరిస్థితి అలా లేదని, అది ఆప్‌కు ఎదురుదెబ్బ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ఇవి కూడా చదవండి