ఆశా వర్కర్ల గోడు పట్టని అధికారులు

ABN , First Publish Date - 2021-05-10T05:29:12+05:30 IST

మన్యంలో క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను అందిం చే ఆశావర్కర్లు కనీస భరోసా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి నెల నెలా ఇచ్చే కనీస గౌరవవేతనాన్ని సకాలంలో అందించడంలో ఆయా ఆధికారులు విఫలమవుతున్నారు.

ఆశా వర్కర్ల గోడు పట్టని అధికారులు
దీక్ష చేస్తున్న ఆశావర్కర్లు

  • గౌరవ వేతనం, ‘కంటి వెలుగు’ రెమ్యూనరేషన్‌ బకాయిలు
  • పలువురు వర్కర్లపై వైద్యాధికారుల వేధింపులు
  • సమస్యలు పరిష్కరించాలంటూ 21 రోజులుగా ఐటీడీఏ కార్యాలయం ఎదుట దీక్షలు

రంపచోడవరం, మే 9: మన్యంలో క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను అందిం చే ఆశావర్కర్లు కనీస భరోసా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి నెల నెలా ఇచ్చే కనీస గౌరవవేతనాన్ని సకాలంలో అందించడంలో ఆయా ఆధికారులు విఫలమవుతున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో గిరిజనుల ఆరో గ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వైద్యఆరోగ్యశాఖ వైద్యాధికారులు, సిబ్బంది పైనే ఉన్నా క్షేత్రస్థాయిలో వైద్యసేవలను ఆశావర్కర్లపై నెట్టేసి కాగితాలపై ప్రగతి నివేదికలను సమర్పించుకోవడానికే ఆయా వైద్యాధికారులు, సిబ్బంది పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో కీలక సేవలందించే ఆశా వర్కర్లపై ఐటీడీఏ, వైద్యా ఆరోగ్యశాఖాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా వీరికి 2018 ఆగస్టు నెల నుంచి గౌరవ వేతనాలు, వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు రెమ్యూనరేషన్‌ బకాయిలు చెల్లించడం లేదు. ఆశావర్కర్లపై పలువురు వైద్యా ధికారులు వేధింపులకు పాల్పడడం వంటి సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సేవల వైఫల్యాలకు ఏ సంబంధం లేని ఆశా వర్కర్లను బలి చేస్తున్నారని ఆశావర్కర్ల సంఘం ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఈ సమస్యలపై ఇరవై రోజులుగా రంపచోడరం కేంద్రంగా ఐటీడీఏ సమీపంలో వారు ఆందోళన చేస్తున్నా ఎవరికి వీరి గోడు పట్టడంలేదు. దీంతో వీరు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 14 ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశావర్కర్లం దరూ నాలుగు రోజులుగా విధులను బహిష్కరించగా క్షేత్రస్థాయిలో వీరి ద్వారా అందాల్సిన వైద్యసేవలు నిలిచిపోయిన కూడా కరోనా విపత్కర పరి స్థితుల్లో సైతం ఐటీడీఏ అఽధికారులకు గాని వైద్యాఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లకు గాని ఆశా వర్కర్ల గోడు పట్టడం లేదు.

బెదిరింపులకు దిగుతున్న ఆధికారులు

ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు వారి వైఫల్యాలను దాచిపెట్టుకుని వీరిపై బెదిరింపులకు దిగుతున్నారు. స్థానిక ఐటీడీఏ అధికా రుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు ఆశావర్కర్లపై బెదిరింపులకు దిగుతు న్నారని సీఐటీయూ నాయకులు మట్ల వాణిశ్రీ, కొమరం చెల్లియమ్మ తదిత రులు ఆరోపించారు. అఽధికారుల బెదిరింపులకు బెదిరిపోయే గిరిజన మహి ళలం కాదని వారు అన్నారు. వీరి ఉద్యమానికి క్రమేణా ఆదరణ పెరుగు తోంది. వీరి సమస్యలను పరిష్కరించి క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలను పునరు ద్ధరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 

Updated Date - 2021-05-10T05:29:12+05:30 IST