‘ఆసరా’ కోసం మహిళల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-27T04:58:31+05:30 IST

ఆసరా డబ్బులు తమ ఖా తాల్లోకి నేటికీ జమ కాలేదని డ్వాక్రా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆసరా’ కోసం మహిళల ఆగ్రహం
ఎంపీపీతో కలిసి వెలుగు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న డ్వాక్రా సభ్యులు

వెలుగు కార్యాలయం వద్ద నిరసన

వైసీపీ ఎంపీపీ సైతం నిరీక్షణ

రాచర్ల, అక్టోబరు 26 : ఆసరా డబ్బులు తమ ఖా తాల్లోకి నేటికీ జమ కాలేదని డ్వాక్రా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వెలు గు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మండలంలో మొత్తం 723 డ్వాక్రా గ్రూపులు ఉండగా ఆసరా కింద రూ.5.22 కోట్లు  మంజూరయ్యాయి. రోజులు గడుస్తున్నా వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో ప్రతిరోజూ బ్యాంక్‌, వెలుగు కార్యాలయాల చుట్టూ మహిళలు తి రుగుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం 150 మంది మహిళలు ఎంపీపీ షేక్‌ ఖాశింబీతో కలిసి స్థాని క ఏపీజీబీకి వెళ్లగా ఏటీఎం కార్డు, కుటుంబసభ్యులకు అప్పులు ఉన్నాయా, లేదా వారి అకౌంట్లు, బయోడేటా లాంటి వివరాలు ఇస్తేనే ఆసరా నిధులు చెల్లిస్తామని చెప్పారు. దీంతో వీరంతా వెలుగు కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఎంపీపీ షేక్‌ ఖాశింబీ కూడా ఆసరా నిధుల కోసం ఎదురుచూడడంతోపాటు గ్రూ పుల సభ్యులతో నిరసనలో పాల్గొన్నారు. రోజు వారీ కూలి పనులు చేసుకుని బతుకుతున్నామని, మూడురోజుల నుంచి అటు బ్యాంక్‌, ఇటు వెలుగు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆంక్షలు విధించడం లేదు

- ప్రసాదరావు, ఏపీజీబీ మేనేజర్‌ 

ఆసరా నిధులను గ్రూపు ఖాతాల నుంచి కొంత మంది సభ్యుల ఖాతాలకు బదిలీ చేశాం. ఏటీఎం కా ర్డు తీసుకుంటే లావాదేవీలు జరుపుకోవడానికి సుల భంగా ఉంటుందని చెప్తున్నాం. అప్పు విషయాలు అ డగడం లేదు. వీలైనంత త్వరలోనే అందరికీ ఆసరా నిధులు జ మ చేస్తాం. 

బ్యాంక్‌ అధికారులు నిలిపివేశారు

ఆసరా పథకం కింద మహిళలకు వారి ఖాతాల్లో నిధులు జమ చేశాం. కానీ బ్యాంక్‌ అధికారులు సవాలక్ష కారణాలు చెప్పి ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదు. మహిళలు వెలుగు కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. 

- రఘుబాబు, ఏపీఎం, రాచర్ల


Updated Date - 2021-10-27T04:58:31+05:30 IST