పంచగవ్య ఘృతము

ABN , First Publish Date - 2021-02-23T17:57:47+05:30 IST

ఆయుర్వేద వైద్యంలో ఉన్మాద రోగాలకు వాడే ఔషధాలలో పంచగవ్య ఘృతము ఒకటి. దీన్నే స్వల్ప పంచగవ్య గృతము అని కూడా అంటారు. దీని తయారీ, ఉపయోగాల గురించి శాస్త్రగ్రంధాలైన చక్రదత్త, భైషజ్య రత్నావళి మొదలైన గ్రంథాల్లో ఈ శ్లోకంలో చెప్పబడింది.

పంచగవ్య ఘృతము

ఆంధ్రజ్యోతి(23-02-2021)

ఆయుర్వేద వైద్యంలో ఉన్మాద రోగాలకు వాడే ఔషధాలలో పంచగవ్య ఘృతము ఒకటి. దీన్నే స్వల్ప పంచగవ్య గృతము అని కూడా అంటారు. దీని తయారీ, ఉపయోగాల గురించి శాస్త్రగ్రంధాలైన చక్రదత్త, భైషజ్య రత్నావళి మొదలైన గ్రంథాల్లో ఈ శ్లోకంలో చెప్పబడింది.

శ్లో. గోశకృద్రస దధ్యమ్ల క్షీరమూ త్రైస్స్యమైర్ఘ్రతం

   సిద్ధం చాతుర్ధికోనాద గ్రహపస్మారనాశనమ్‌

పంచగవ్య ఘృతమును ఆవు పేడసం, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు పంచకం... వీటిని సమ భాగాలుగా ఆవు నేతితో కలిపి మరిగించి తయారుచేస్తారు. ఉన్మాద అపస్మార గ్రహ రోగాలు, అదేవిధంగా చదుర్దిక జ్వరాలను పంచగవ్య ఘృతము నశింపజేస్తుందని చెప్పబడింది. పంచగవ్య ఘృతమును అనుపానంగా వాడడం ద్వారా రాచపుండు (కేన్సర్‌), తీవ్రమైన చర్మ రోగాలు, శ్వాస సంబంధమైన సమస్యల్లో విశేషంగా పని చేస్తుందని వైద్య గ్రంథాలు చెబుతున్నాయి. 

ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 గ్రాముల చొప్పున, పిల్లలు 5 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం పాలు అనుపానంగా తీసుకోవాలి, లేదా వైద్యుల సూచన ప్రకారం వాడాలి. ప్రస్తుతం వైద్యరత్న, ఎస్‌ఎన్‌ఎ, కొట్టక్కల్‌ వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.

- శశిధర్‌,

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ట్రస్ట్‌,

కొత్తపేట, చీరాల.

Updated Date - 2021-02-23T17:57:47+05:30 IST