UP poll: కారులో వదిలిన ఈవీఎం...అధికారుల దర్యాప్తు

ABN , First Publish Date - 2022-02-11T14:04:30+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కైరానాలో గురువారం సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు నంబర్ ప్లేట్ లేని వాహనంలో ఓ ఈవీఎం యంత్రాన్ని కనుగొన్నారు...

UP poll: కారులో వదిలిన ఈవీఎం...అధికారుల దర్యాప్తు

లక్నో(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కైరానాలో గురువారం సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు నంబర్ ప్లేట్ లేని వాహనంలో ఓ ఈవీఎం యంత్రాన్ని కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గురువారం మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరిగిన 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కైరానా ఒకటి.ఈవీఎం యంత్రం దొరికిన కారుపై జోనల్ మేజిస్ట్రేట్ - కైరానా నియోజకవర్గం అనే స్టిక్కర్‌ను అతికించారు. షామ్లీ-పానిపట్ హైవేపై స్థానిక మెజిస్ట్రేట్ తో పాటు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కారును కనుగొన్నారు.అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌ ఎదుట ఈవీఎంను తెరిచి పరిశీలించారు. ఎన్నికల భద్రతా నియమావళిని ఉల్లంఘించారని జిల్లా మెజిస్ట్రేట్ అంగీకరించారు.మొదటి విడత పోలింగ్ పర్వంలో ఈవీఎం కారులో ప్రత్యక్షమవడం పలు రకాల అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.


Updated Date - 2022-02-11T14:04:30+05:30 IST