విజ్ఞాన రంగానికి అబ్దుల్‌కలాం కృషి చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-07-28T06:08:48+05:30 IST

విజ్ఞాన రంగానికి డాక్టర్‌ అబ్దుల్‌కలాం చేసిన కృషి చిరస్మరణీయం అని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు.

విజ్ఞాన రంగానికి అబ్దుల్‌కలాం కృషి చిరస్మరణీయం
కలాం చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న చైర్మన్‌ గఫార్‌

కనిగిరి, జూలై 27: విజ్ఞాన రంగానికి డాక్టర్‌ అబ్దుల్‌కలాం చేసిన కృషి చిరస్మరణీయం అని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు. కలాం వర్ధంతి సందర్భంగా స్థానిక ఒంగోలు బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధనాశాలలో శాస్త్రవేత్తగా రాకెట్ల ప్రయోగాల్లో విజయం సాఽధించి దేశ ప్రతిష్టను మరింత పెంచారన్నారు.  రాష్ట్రపతి పదవీకాలంలో పేదల సంక్షేమ కోసం ఎంతో కృషి చేశారన్నారు.  కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, కో ఆప్షన్‌ సభ్యులు చింతం శ్రీనివాసులు యాదవ్‌, నాయకులు రామనబోయిన శ్రీనివాసులయాదవ్‌, పసుపులేటి ఆరుణోధర్‌, కౌన్సిలర్‌ దేవకి రాజీవ్‌, రహిమాన్‌, ఖాశీంసా, నాయబ్‌ రసూల్‌, గఫార్‌ యూత్‌ఫోర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

పామూరు : స్థానిక శేషమహాల్‌ల్లో అబ్దుల్‌ కలాం 6వ వర్ధంతి కార్యక్రమంమంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు టీడీపీ జిల్లా కమిటీ కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌బాబు, అధికార ప్రతినిఽధి వైఎస్‌.ప్రసాద్‌రెడ్డిలు పాల్గొని కలాంకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో యు హరిబాబు, దేవవరపు మాల్యాద్రి, రహంతుల్లా, సాంబయ్య, మౌలాలి, శ్రీనివాసులు, జి రవికుమార్‌, చావా సుబ్బారావు పాల్గొన్నారు. స్వయంకృషి సేవాసంస్థ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయబ్‌ రసూల్‌, కేసీపీఎన్‌ ప్రాజెకు ్టమేనేజర్‌ బీఏ కుమార్‌, సంస్థ సభ్యులు సయ్యద్‌ జిలాని, వేల్పుల నారాయణయాదవ్‌, సోమిశెట్టి సత్యనారాయణ, బూతరాజు అవీస్‌ తదితరులు పాల్గొన్నారు. 

కందుకూరు : దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్‌ కలాం వర్థంతిని మంగళవారం వైఎ్‌సఆర్‌ యువదళ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. యువదళ్‌ అధ్యక్షుడు రహీమ్‌, ముస్లిం వెల్ఫేర్‌ అధ్యక్షుడు కరీముల్లా, సుల్తాన్‌, ముజాకీర్‌, నరంద్ర, నయీమ్‌ బాషా, శ్రీనులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ముండ్లమూరు : స్థానిక బస్టాండ్‌ కూడలిలో ఎస్సీ సెల్‌ నాయకుడు డగ్లస్‌ ఆధ్వర్యంలో కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మీరావలి, పేరారెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:08:48+05:30 IST