అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దళిత నేతలు
కావలి, మే19: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామ కరణం చేస్తామనటం మంచి పరిణామమేనని, కానీ అందుకు రెండు జిల్లాల్లో అభిప్రాయసేకరణ కావాలని మెలికపెట్టడం అవమానించటమేనని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లి పేర్కొన్నారు. కావలి ట్రంకు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం సాయంత్రం సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణతో మెలిక సరికాదని ప్లకార్డుల ప్రదర్శన చేశారు. అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాలకు ప్రజాభిప్రాయాన్ని సేకరించే పేర్లు మార్చారా ? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ జిల్లాకే ప్రజాభిప్రాయ సేకరణ కావాలనటం బడుగు వర్గాలను అవమానపర చటమేన న్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జరుగు మల్లి విజయర త్నం, పాదర్తి శ్రీనివాసులు, చౌటూరి రత్నం, సునీల్‌కుమార్, లక్ష్మీనర్సు తదితరులు పాల్గొన్నారు.