వాడవాడలా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2020-11-27T06:10:46+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ పిలుపుని చ్చారు.

వాడవాడలా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నర్సీపట్నంలో అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం/ నర్సీపట్నం రూరల్‌ , నవంబరు 26 : భారత రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ పిలుపుని చ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్‌ ఎదురుగా పెట్రోల్‌ బంక్‌ వద్ద అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లా డారు. అంబేడ్కర్‌ అందరి ఆరాధ్యుడుగా పేర్కొన్నారు.  డీహెచ్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.అప్పలరాజు, అరిగొల్లు రాజుబాబు, మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో సిబ్బంది అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చిన అనంతరం ప్రతిజ్ఞ చేశారు.  


నాతవరంలో..

నాతవరం : భారత రాజ్యంగానికి లోబడే అందరూ పనిచేయాలని ఎంపీడీవో యాదగిరేశ్వరరావు అన్నారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాతవరంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ అంకంరెడ్డి జమీలు, కార్యదర్శి  చినబాబు, ఏపీవో చిన్నారావు  పాల్గొన్నారు. 


 గొలుగొండలో.. 

గొలుగొండ, నవంబరు 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జోగంపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు.  నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రాజాన సూర్యచంద్ర తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనకాపల్లిలో...

అనకాపల్లి టౌన్‌: పట్టణంలోని నెహ్రూచౌక్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ వేదిక కన్వీనర్‌ దూలం బుసిరాజు, పలు పార్టీలు, సంఘాల నాయకులు కొణతాల జనార్థన్‌, వైఎన్‌ భద్రం, కొణతాల హరినాథ్‌, కర్రి రామకృష్ణ, మట్టా కుమార్‌, కె.సురేష్‌బాబు పాల్గొన్నారు. అలాగే నెహ్రూచౌక్‌లోని ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ, వేదిక ప్రతినిధులు పి.సన్యాసిరావు, ఎంఏ రాజు, కోన లక్ష్మణ పాల్గొన్నారు. 

 

నక్కపల్లిలో..

నక్కపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్స వంలో ఎంపీడీవో రమేశ్‌రామన్‌, ఈవోపీఆర్‌డీ  సీతారామరాజు, పలువురు పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


మునగపాకలో..

మునగపాక : మునగపాక, ఉమ్మలాడ, తిమ్మరాజుపేట గ్రామాల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గల అంబేడ్కర్‌ విగ్ర హాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మునగపాకలో గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌, ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరివి సుందరరాజు, దళిత నాయకులు రాజాన బుజ్జి, కంకణాల శ్రీనివాసరావు, దిమ్మల నూకరాజు, అప్పారావు, చంటి పాల్గొన్నారు.


ఎలమంచిలిలో..

ఎలమంచిలి : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  దిమిలి రోడ్డు జంక్షన్‌లో గల అంబేడ్కర్‌ విగ్రహానికి ఏఎంసీ చైర్‌పర్సన్‌ జి.అప్పలనర్స, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గొంపాన అప్పారావు, కమిటీ సభ్యులు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

 

Updated Date - 2020-11-27T06:10:46+05:30 IST