Debate: ఎవరు దుష్టచతుష్టయం Jagan?

ABN , First Publish Date - 2022-06-28T01:42:59+05:30 IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohan Reddy) ఏ పర్యటన వెళ్లినా ముందుగా దుష్టచతుష్టం అనే పదాన్ని వాడుతున్నారు...

Debate: ఎవరు దుష్టచతుష్టయం Jagan?

అమరావతి/హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohan Reddy) ఏ పర్యటనకు వెళ్లినా ముందుగా దుష్టచతుష్టం అనే పదాన్ని వాడుతున్నారు. రాజకీయ నేతలు, పత్రికలకు లింకు పెడుతూ  కొత్త కొత్త పదాలు వాడి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లోపాలపై వార్తలు రాస్తే తట్టుకోలేకపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. అమ్మఒడి (Amma Vodi) నిధులు విడుదల చేసి ఎక్కువగా దుష్టచతుష్టం అనే పదాన్నే జపించారు. ‘అమ్మఒడి’ పథకానికి పెట్టిన నిబంధనలపైనే పత్రికలు, ఛానళ్లు వార్తలు రాశాయి. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దాన్ని తప్పుబడుతూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకూ కరెక్ట్ అని అటు రాజకీయ విశ్లేషకులు, నేతలు, ప్రజా సంఘాలు, పత్రికా పాఠకులు అంటున్నారు. నిబంధనలు, లోపాలను సరిదిద్దుకొని ప్రజా రంజక పాలన అందించాల్సిన బాధ్యత సీఎం జగన్‎పై ఉందని.. పత్రికలు, ఛానళ్లలోె వస్తున్న కథనాలు.. ప్రసారాలు తప్పు బడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘వరు దుష్టచతుష్టయం మిస్టర్ జగన్ (Jagan)?. మీరూ మీ ముగ్గురు దుష్టులు కాదా అసలు చతుష్టయం?. ప్రజలను నిత్యం వంచిస్తూ నంగనాచి మాటలా?. అమ్మ ఒడిపై మీరు చెప్పిందేంటి... చేస్తున్నదేంటి?. వైసీపీ (Ycp) వాళ్ల అరాచకాలపై కూడా అప్రజలకు చెప్పగలరా?. అసలు దుష్టులు ఎవరో ప్రజలు గ్రహించలేరని ధీమానా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (Abn Andhrajyothy) డిబేట్ (Debate) నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-06-28T01:42:59+05:30 IST