YCP Plenaryకి గౌరవ అధ్యక్షురాలు Vijayamma వస్తారా?

ABN , First Publish Date - 2022-07-01T20:31:53+05:30 IST

వైసీపీ నేతలు ప్లీనరీ వేదికలపైనే గొడవలు పడడం, వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న తీరు..

YCP Plenaryకి గౌరవ అధ్యక్షురాలు Vijayamma వస్తారా?

అమరావతి (Amaravathi): వైసీపీ నేతలు (YCP Leaders) ప్లీనరీ వేదికలపైనే గొడవలు పడడం, వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న తీరు కనబడుతోంది. కొన్ని చోట్ల ప్లీనరీలకు కూడా జనం రాక.. ఉపాధి హామీ కూలీలు, వాలంటీర్లను తీసుకువచ్చి కూర్చోబెడుతున్నారు. కాగా ఈ నెల 8,9 తేదీల్లో మెయిన్ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ (Vijayamma) హాజరవుతారా? లేదా? అనే సందేహం అందరిలో నెలకొంది.


కుటుంబ సమస్యల కారణంగా విజయమ్మ సీఎం జగన్ (CM Jagan) ఇంటి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణలో పార్టీ పెట్టిన కుమార్తె షర్మిల (Sharmila)తో కలిసి ఉంటున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో హంతకులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు రావడంతో వైఎస్సార్ బంధువులు.. జగన్ కుటుంబం వైపు బంధువర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాగా విజయమ్మ ప్లీనరీ సమావేశాలకు వస్తారా? అని నిన్న ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అతనిపై సజ్జల, విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తారంటూ సజ్జల చెప్పుకొచ్చారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. పలువురి నేతల అభిప్రాయాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.  

Updated Date - 2022-07-01T20:31:53+05:30 IST