ABN కథనాలపై స్పందించిన గనుల శాఖ... వారిని వదిలిపెట్టమని హెచ్చరిక

ABN , First Publish Date - 2022-01-14T03:21:32+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై గనుల శాఖ స్పందించింది. కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో..

ABN కథనాలపై స్పందించిన గనుల శాఖ... వారిని వదిలిపెట్టమని హెచ్చరిక

చిత్తూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై గనుల శాఖ స్పందించింది. కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు.  డీఎంజీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దాడులు, తనిఖీలు నిర్వహించారు. శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 40 గ్రానైట్ బ్లాక్‌లు, 6 కంప్రెషర్లు, 2 హిటాచీ యంత్రాలను సీజ్ చేశారు. అక్రమ మైనింగ్‌ని అడ్డుకునేందుకు పటిష్ఠమైన చెక్‌పోస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాల సరిహద్దులో చెక్‌పోస్టులతో ప్రత్యేక నిఘాతో పాటు రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులతో మొబైల్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. గతంలో సి. బండపల్లి అటవీ భూముల్లో భారీగా గ్రానైట్ బ్లాకులు సీజ్‌ చేశామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని డీఎంజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2022-01-14T03:21:32+05:30 IST