Minister Avanthi పై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.. ఆయన ఎక్కడున్నా.. ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవా.. YSRCP నేతల్లో టెన్షన్‌.. ఆందోళనలో కార్యకర్తలు..!?

ABN , First Publish Date - 2021-08-30T19:58:53+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ నేత ముందే అంచనా వేయగలరా..? ...

Minister Avanthi పై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.. ఆయన ఎక్కడున్నా.. ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవా.. YSRCP నేతల్లో టెన్షన్‌.. ఆందోళనలో కార్యకర్తలు..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ నేత ముందే అంచనా వేయగలరా..? వరుసగా పార్టీలు జంప్ చేయడానికి ఆయనకో లెక్కుందా? ఎప్పుడు అధికార పార్టీలోనే ఉండటం ఎలా సాధ్యం..? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆయనపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? ఇంతకీ ఆ మంత్రి ఎవరు..? ఆ ప్రచారమేంటి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


అవంతిపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అవంతి విద్యాసంస్థలు ఉండడంతో ఆయన్ని అవంతి శ్రీనివాసరావు అని కూడా పిలుస్తుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనకు అప్పుడు మంత్రి పదవి రావడంపై రాజకీయ ప్రత్యర్ధులు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అవిర్భావం నుంచి ఉన్న వారికి కాదనీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన అవంతికి మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని విమర్శలు కూడా వినిపించాయి. అటు పార్టీ హైకమాండ్ కానీ, ఇటు మంత్రి అవంతి కాని ఆ ఆరోపణలను పట్టించుకోలేదు.


ప్రచారం నిజమేనా.. కొత్తగా విషయాలేంటి..?

అవంతి మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జగన్‌కి భజన చేయడం.. చంద్రబాబుని తిట్టడమే ప్రధాన అంజెడా పెట్టుకున్నారు. అందుకే ఆయన నిర్వహించిన ఏ కార్యక్రమంలోనైనా ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇటీవల ఆయనపై జరుగుతున్న ప్రచారంతో మరింత ఫేమస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒకటి, రెండు ఆడియోలు హల్ చల్ చేయడంతో అవంతి ఎవరో తెలీయని వారికి సైతం ఆయన తెలిసిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. అయితే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు మంత్రి అవంతిపై  సరికొత్త ప్రచారం మొదలు పెట్టారు.


ఇప్పటి వరకూ ఎన్ని పార్టీలో..!

అవంతి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలైంది. ఆ పార్టీ తరుపున 2009లో విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యాం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అవంతి కాంగ్రెస్‌ను వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపును అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి, వైసిపిలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రసుత్తం జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పడు ఈ విషయాలే వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


ఏ పార్టీలో ఉన్నా.. ఆపార్టీకి ఇబ్బందులు తప్పవా?

అవంతి శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ అంతర్ధానం కావడమో, లేదో భవిష్యత్తు లేకుండా పోతుందని.. ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. అవంతి ఉన్న పార్టీకి  తీవ్ర నష్టం తప్పదని, ఆయన మాత్రం చాలా సేఫ్ గా బయటపడతారని ఆ ప్రచార సారాంశం. మంత్రిగా ప్రత్యర్థులు దీనికి ఉదాహరణలు సైతం చెబుతుండడంతో వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. కావాలంటే ఆయన పొలిటికల్ కేరియర్ ని ఒక్కసారి చూడమని సలహా ఇస్తున్నారు.


వరుస జంపింగ్‌కు కారణమేంటి?

మంత్రి అవంతి పొలిటికల్ కేరీర్ చూస్తే ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ అంతర్ధానం కావడమో.. కోలుకోలేని విధంగా దెబ్బతినడమో జరుగుతుందని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు గుసగుసలాడుతున్నారు. గతంలో అవంతి ఉన్న పార్టీలకు కష్టకాలం ఎదురైతే.. ఆయన మాత్రం సేఫ్ సైడ్ లో ఉంటారని, ఇదే అవంతి చాణుక్యమని చెబుతున్నారు. అవంతి శ్రీనివాసరావు రాజకీయ అరంగ్రేటం చేసిన ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిందని గుర్తు చేస్తున్నారు. ప్రజారాజ్యం తర్వాత, అవంతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని.. ఆ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండాపోయిందని అంటున్నారు. ఆ తర్వాత ఆయన, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారని.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిని చవిచూసిందని చెబుతున్నారు.


ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు.. కొనసాగుతున్న టెన్షన్!

ప్రస్తుతం అవంతి శ్రీనివాసరావు  వైసీపీలో ఉన్నారు. పైగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీలకు ఇబ్బందులు వచ్చాయని, ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పరిస్థితి, భవిషత్తు ఏమిటని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. మంత్రిగారిపై జరుగుతున్న ఈ ప్రచారాలను, ఊహాగానాలను అవంతి అనుచరులు కొట్టిపడేస్తున్నారు. అవంతి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక, అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అవంతి రాజకీయ ప్రత్యర్ధుల ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.




ఇవి కూడా చదవండిImage Caption

YS Jagan Cabinet : ఆ ఇద్దరిలో ఒకరికి Minister పదవీ గండం.. Tammineni కి చిగురిస్తున్న ఆశలు.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి.. ఏం జరుగుతుందో..!?Dharmana Prasad : పెద్దాయన రిటైర్మెంట్ పక్కానా.. ఆయన టార్గెట్ ఏంటి.. యువనేతకు ఛాన్స్ వస్తుందా..!?Grama, Ward Sachivalayam ఉద్యోగుల కుటుంబాలకు Jagan Govt షాక్‌..ABN Inside : అజ్ఞాతం వీడనున్న కీలక నేత.. TDP నుంచి ఆహ్వానం అందిందా.. అదే జరిగితే AP రాజకీయాల్లో భారీ మార్పులు!సెప్టెంబర్‌లో Nara Lokesh అరెస్ట్.. Chandrababu తో రెండు సార్లు చెప్పిన మాజీ మంత్రి.. TDP లో హాట్ డిస్కషన్.. ఏం జరగబోతోంది..!?Jagan కు షర్మిల ఎందుకు రాఖీ కట్టలేదు?.. ఇడుపులపాయలో అసలేం జరిగింది!?TDP లో ఉన్నప్పుడు కొనసాగిన హవా.. ఇప్పుడు YSRCP MP గా ఉన్నా పప్పులుడకట్లేదేం.. రాత్రికి రాత్రే ఎందుకిలా.. పొమ్మన లేక పొగ పెడుతున్నారా..!?Gorantla అసంతృప్తికి ఆ లేడీ ఎమ్మెల్యే కారణమా.. అసలేం జరిగింది.. అలక పోయినట్లేనా.. Butchaiah మనసులో ఏముంది.. TDP ఏమనుకుంటోంది..!?షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్‌‌కిషోర్.. సెప్టెంబర్ నుంచి రంగంలోకి..!

Updated Date - 2021-08-30T19:58:53+05:30 IST