ABN Effect : త్వరలోనే Lumbini Parkలో లేజర్‌షో..

Published: Sat, 28 May 2022 09:30:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ABN Effect : త్వరలోనే Lumbini Parkలో లేజర్‌షో..

  • ట్రయల్‌ రన్‌ చేపట్టిన నిర్వహణ సంస్థ
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

హైదరాబాద్‌ సిటీ : లుంబినీపార్కులో లేజర్‌షోను త్వరలో ప్రారంభించడానికి నిర్వహణ సంస్థ చర్యలు చేపట్టింది. 2020 మార్చిలో కొవిడ్‌-19 కారణంతో విధించిన లాక్‌డౌన్‌ వల్ల మూతపడిన లేజర్‌షోను పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండేళ్లకు పైగా లేజర్‌షో మూతపడడంతో హుస్సేన్‌సాగర్‌ తీరాన నగరవాసులకు, పర్యాటకులకు ఆటవిడుపు కరువైందనే తదితర అంశాలతో ఈ నెల 19న ‘లేజర్‌షో కనుమరుగు’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది.

ABN Effect : త్వరలోనే Lumbini Parkలో లేజర్‌షో..

దీనికి స్పందించిన హెచ్‌ఎండీఏలోని  బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ) అధికారులు లేజర్‌షో పునప్రారంభించాలని నిర్వహణ సంస్థకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో నిర్వహణ సంస్థ రెండు రోజులుగా లేజర్‌షో ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటేన్‌తోపాటు లేజర్‌షోలో సాంకేతిక ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ABN Effect : త్వరలోనే Lumbini Parkలో లేజర్‌షో..

లేజర్‌షోలో ప్రస్తుతమున్న పాటలు, డిజైన్లతో పాటు సరికొత్తగా చేర్చాల్సిన వాటిపై హెచ్‌ఎండీఏలోని ఉన్నతాధికారుల బృందం రేపో, మాపో పరిశీలించనున్నారు. లేజర్‌షో ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే రెండేళ్లకు పైగా నిర్వహణ లేకపోవడంతో లేజర్‌షో ప్రాంగణం అధ్వానంగా మారడంతో పరిశుభ్రం చేసే చర్యలు చేపట్టారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.