‘ప్రేమించిన అమ్మాయిని వారం రోజుల్లో నీ వశం చేస్తాం’.. ముఠా గట్టు రట్టు చేసిన ఏబీఎన్

Aug 26 2021 @ 16:23PM

హైదరాబాద్: వశీకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రట్టు చేసింది. యువతీయువకులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్న ముఠాపై ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ఏబీఎన్ చేసిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల్లో నువ్వు ప్రేమించే అమ్మాయిని నీ వశం చేస్తానంటూ నమ్మించి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మల్లేపల్లి కేంద్రంగా ఈ దందా నడుస్తోంది. ఈ దందా గురించి తెలిసిన ఏబీఎన్.. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో ముఠాకు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. ఆ ఇద్దరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.