గుంటూరు: లంచం లేకపోతే మంచం ఇవ్వం..

ABN , First Publish Date - 2021-05-11T18:16:05+05:30 IST

బెడ్ కావాలంటే రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు సమర్పించుకోవాల్సిందే.

గుంటూరు: లంచం లేకపోతే మంచం ఇవ్వం..

గుంటూరు: లంచం ఇవ్వందే మంచం ఇవ్వమని.. బెడ్ కావాలంటే రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు సమర్పించుకోవాల్సిందే. లేదంటే కోవిడ్ పేషెంట్ గేటు బయటే కొన ఊపిరితో గిల గిలా కొట్టుకుంటున్నా అలాగే చూస్తారు తప్ప బెడ్ మాత్రం ఇవ్వరు. దీంతో రోగి ఆస్పత్రి లోపల అడుగు పెట్టకముందే ప్రాణాలు వదులుతున్నాడు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో తాజా పరిస్థితి. 


గుంటూరు జీజీహెచ్ సిబ్బంది బరితెగిస్తున్నారు. కోవిడ్ రోగి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ఇదే అదునుగా ఆస్పత్రి సిబ్బంది లంచాలకు తెగబడుతున్నారు. ఓ ఘనుడు ఏకంగా ఆక్సిజన్ బెడ్లనే అమ్మకానికి పెట్టాడు. రూ. 20వేలతో మొదలుపెట్టి రూ. 50వేల వరకు బేరాలు జరుగుతున్నాయి. 


ఇక్కడ సిబ్బంది రూ.20వేలను కోడ్ భాషలో రూ. 2 వందలుగా చెబుతున్నారు. రూ.30వేలను 3 వందలుగా, రూ.50వేలను 5 వందలుగా మాట్లాడుతూ దందాను కొనసాగిస్తున్నారు. ఈ బెడ్ల దందాను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టింది. వార్డు బాయ్ బొబ్బిలి శ్రీనివాస్ కోవిడ్ పేషెంట్ బంధువు మధ్య సాగిన బెడ్ బేరసారాల మాటలను ఈ వీడియోలో వినండి. చివరికి వారి మధ్య రూ.30 వేలకు బేరం కుదురింది.

Updated Date - 2021-05-11T18:16:05+05:30 IST