
తెల్లమచ్చల వ్యాధిని బొల్లి అంటాం. ఆంగ్ల పరిభాషలో విటిలిగో లేదా లూకోడెర్మా అంటారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు ప్రపంచ జనాభాలో 1 శాతం కన్నా తక్కువే. అయితే, ఈ మచ్చలు శారీరకంగా ఏ బాధకూ గురిచేయకపోయినా, మానసికంగా, సామాజికంగా బాగా కుంగదీస్తాయి. తెల్ల మచ్చలు రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తాయి. జన్యువుల్లో వచ్చే తేడాల వల్ల మన రక్షణ వ్యవస్థ నల్లకణాలు (మెలనోసైట్స్) మీద దాడి చేయడం వల్ల నల్లకణాలు నశిస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతం తెల్లబడుతుంది. హైపర్ థైరాయిడ్ మరియు అలోపేసియా ఎరియాట, పర్నీసియా ఎనీమియాలో ఎక్కువగాచూస్తాం. నిజానికి, తెల్లమచ్చలు రావడానికి ్ఠ్చ ్జగల కచ్ఛితమైన కారణాల్ని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. అయితే కొన్నిరకాల జన్యుసంబంధిత లోపాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చర్మం శరీరానికి కవ చంగా పనిచేస్తుంది. శరీరంలో ఉండే ఎముకలు కండరాలు లిగమెంట్స్, ఇతర భాగాలు చర్మంతో కప్పబడి ఉంటుంది. . చర్మం శరీరంలోకెల్లా అతిపెద్ద ఆర్గాన్. ప్రతి మనిషిలో స్క్వేర్ ఇంచ్కు 650 చెమట గ్రంధులు,20 రక్తనాళాలు, 60 వేల మెలనోసైట్స్ వెయ్యికి పైగా నరాలు ఉంటాయి.
. చర్మ వ్యాధులు చాలా రకాలు. అందులో తెల్లమచ్చలు చాలా మంది కలవరపెడతాయి. చర్మం, వెంట్రుకలు, కళ్ల రంగు మెలాసిన్ హార్మోన్ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. తెల్లమచ్చలు సాధారణంగా ముఖం, పెదాలు, చేతులు, కాళ్ల మీద కనిపిస్తాయి.
ఎవరికి వస్తాయి?
తెల్లమచ్చలు ప్రతి పది మందిలో ఒకరికి లేదాఇద్దరికి వస్తూ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో పాటు టైప్-1 డయాబెటీస్, అడిసన్ డిసీజ్, అమోఎబిక్ డిసేంట్రీ వంటి వ్యాధుల వల్ల కూడాఈ సమస్య రావచ్చు. కొంత మంది శరీరంలోని ఇమ్యూన సిస్టమ్ తగ్గి డి-పిగ్మెంటేషనకు గురి అవుతున్నారు. మనిషి యొక్క ఇమ్యూన సిస్టమ్ శరీరములోని ఆర్గాన లేదా కణజాలాలపై వ్యతిరేకంగా పని చేయటం వలన సైటోకిన్స అనే ప్రొటీన్లు మెలానోసైట్స్ను నశింపచేసి విటిలిగో రావటానికి దోహదపడుతుంది. అంతేకాక మెలనోసైట్స్ ఏ కారణము లేకుండానే వాటికి అవే నశించిపోవటం మరియు కొన్ని మానసిక సమస్యల వలన కూడా విటిలిగో వచ్చే అవకాశం వుంది. కాని దీనికి కచ్చితమైన కారణంలేదు.
లక్షణాలు: తెల్లమచ్చలు ముఖ్యంగా ముఖము, చేతులు, పెదవులు, కాళ్లమీద రావచ్చు.
- వేడిని (ఎండను) తట్టుకోలేకపోవటం.
- ముక్కు, కళ్లచుట్టూ, నోరుచుట్టూ వచ్చే మచ్చలు గోల్డెన బ్రౌన రంగులో ఉండొచ్చు.
- వెంట్రుకలు తెల్లగా మారటం
- ఈ తెల్లమచ్చలు పెరగొచ్చు లేదా ఏ పరిమితిలో వచ్చాయో అలాగే వుండిపోవటమో లేదా సైజ్ కొద్దిగా తగ్గిపోవటమో జరుగుతుంది.
- స్ట్రెస్ వలన శరీరంలోని ఇమ్యూన సిస్టమ్ దెబ్బతిని రోగ అంతర్గత శక్తి తగ్గి ఆటోఇమ్యూన డిసీస్ లక్షణాలతో పాటు తెల్లమచ్చలు కూడా రావచ్చును.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి
విటిలిగోకు శాశ్వతమైన పరిష్కారం లేదు కాని ఎప్పుడైతే మీ చర్మం రంగు మారుతున్నట్లు వుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించటం వలన తెల్లమచ్చలు పెరగకుండా పూర్తిగా తగ్గిపోవటానికి మంచి చికిత్సతో రంగు మారిన చర్మాన్ని మళ్లీ మామూలు రంగుకు తీసుకొనిరావచ్చును. తెల్లమచ్చలు వున్న భాగం ఎండకు కందిపోవటం జరుగుతుంది. అందుకే ఎండలో వెళ్లినప్పుడు తమ చర్మాన్ని కాపాడుకోవటం ముఖ్యం.
హోమియో చికిత్స
తెల్లమచ్చలు మొదటి దశలో వున్నపుడే తగిన హోమియోచికిత్స తీసుకోవటం వలన మీరు మీ సమస్య నుంచి బయటపడే అవకాశం వుంది. ఆధునిక క్లాసికల్ హోమియో చికిత్స ద్వారా తెల్లమచ్చలను తగ్గించవచ్చును. రోగి యొక్క శారీరక, మానసిక, నడవడిక పర్సనాలిటి, సైకోసోషియల్ బ్యాక్గ్రౌండ్తో సహా వ్యాధి లక్షణాలను అనాలసిస్ మరియు ఎవాల్యుయేషన చేసి క్లాసిక్ హోమియో చికిత్స ద్వారా కాన్సస్టిట్యూషనల్ మెడిసిన్స ఇవ్వబడును. ఈ మందు కరెక్ట్డోస్ ఇవ్వటంతో మెలాసిన్ హార్మోనల లెవెల్స్ సరి చేయ్యటమే కాక పిగ్మెంటేషన స్టిమ్యూలేట్ చేసి అనారోగ్య చర్మమును ఆరోగ్యవంతం చేయటానికి దోహదపడుతాయి.
డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎం.డి.
హోమియో, స్టార్ హోమియోతి,
ఫోన్- 8977 336677,
టోల్ ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక