Advertisement

ఎన్నికల్లో ఓడిపోయిన ఏ అభ్యర్థి చేయలేని పని ఈమె చేసింది !

May 23 2016 @ 18:07PM

చెన్నై: శాసనసభ ఎన్నికల్లో ఓడిన బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్ టాపు లేని జీపులో ప్రయాణిసూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలో పోటీచేసిన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ 33,113 ఓట్లు పొంది ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపొందిన వారు ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. అయితే వానతీ శ్రీనివాసన్ 20వ తేదీ నుంచి నియోజకవర్గంలో ఒక్కో వీధికి జీపులో వెళ్లి తను ఓడినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా, ఎన్నికల్లో ఓడినప్పటికీ ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం తన బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు. తాను ప్రజలతోనే ఉంటానని, ఏ సహాయం కావాలన్నా ప్రజలు తనను ఎప్పడైనా సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు.

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.