Advertisement

గిన్నిస్ కెక్కిన చిన్నదొడ్డిగల్లు కుర్రాడు

Jun 11 2017 @ 04:13AM

  • టూత్ పిక్‌తో న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌
  • చరిత్ర సృష్టించిన సూక్ష్మ కళాకారుడు వెంకటేష్‌
నక్కపల్లి, జూన్ 10: చిన్నతనంలోనే సూక్ష్మ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల.. ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 380కిపైగా కళాకృతులను రూపొందించాడు. ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకున్నా.. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలన్న కోరికతో సృజనాత్మకతకు మరింత పదునుపెట్టి లక్ష్యాన్ని సాధించాడు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్‌ చదువుతున్న వెంకటేష్‌ ఇప్పటికే ఇండియా బుక్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులు సాధించి, ఇప్పుడు గిన్ని్‌సలో స్థానం సంపాదించాడు. కేవలం ఒకే ఒక టూత్‌ పిక్‌ను ఉపయోగించి 18 మిల్లీమీటర్ల ఎత్తులో న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ను రూపొందించాడు. దీనిని గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ రికార్డు కోసం దరఖాస్తు చేసుకోగా 2016 జూన్‌ 6వ తేదీన పరిశీలించారు. గిన్నిస్ లో స్థానం కల్పించినట్లు శుక్రవారం వెంకటేష్‌కు సర్టిఫికెట్‌ అందింది.
 
కల నెరవేరింది
గతంలో కొందరు అనేక టూత్‌ పిక్స్‌ను ఉపయోగించి న్యూయార్క్‌ సిటీలోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ను రూపొందించారు. కానీ నేను ఒకే టూత్ పిక్‌తో కేవలం 23 నిమిషాల్లో ఆ నమూనాను తయారుచేశాను. 2015లో గిన్నిస్ లో చోటు కోసం దరఖాస్తు చేస్తే 2016లో నా దరఖాస్తును పరిశీలించారు. శుక్రవారం కొరియర్‌ ద్వారా గిన్నిస్‌ బుక్‌ రికార్డు పత్రాన్ని, బుక్‌ను కూడా పంపించడంతో చాలా అనందంగా ఉంది. నా కల సాకారమైంది. భవిష్యత్తులో కూడా సూక్ష్మ కళలో అనేక ప్రయోగాలు చేస్తాను.
-గట్టెం వెంకటేష్‌, సూక్ష్మ కళాకారుడు
 
 
 

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.