Advertisement

ఈ బొంగరాల ఆట చూస్తే గింగిరాలు తిరగాల్సిందే!

Aug 1 2018 @ 11:58AM

ఏ ఆట అయినా ఎంతోకొంత వినోదాన్ని పంచుతుంది. చిన్నప్పుడు ఆడుకునే ఆటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. వాటిలో దాగుడు మూతలు, కోతికొమ్మచ్చి... ఇలా చాలానే ఉంటాయి. వాటిలో బొగరం ఆట ఎంతో వినోదాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఆటకు సంబంధించిన వీడియోను క్యూమా ఫిల్మ్స్ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో బొంగరం ఆటలో నిపుణులైన కొంతమంది ఆట ఆడే తీరు చూస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. ఒకవేళ ఈ ఆటలో వరల్డ్ కప్ అంటూ నిర్వహిస్తే బంగారు పతకాలన్నీ వీరికే దక్కుతాయనేలా వీరి ఆటతీరు ఉండటం గమనార్హం.
‘క్యూమా ఫిల్మ్ప్’ సౌజన్యంతో... 

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.