Advertisement

పురపోరుకు సన్నాహాలు..

May 22 2019 @ 01:15AM

  • ఎస్‌సిఎస్‌టి బిసి మహిళా ఓటర్ల గుర్తింపునకు సర్వే ప్రారంభం
  • రిజర్వేషన్లపై కసరత్తు
  • జూన్‌ 17న ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రకటన
  • నెలరోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్న డీఎంఎ ఆదేశాలు
సామర్లకోట: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియ 24 గంటల్లో ముగియనుంది. నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆ దిశలో మున్సిపల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం వార్డుల రిజర్వేషన్‌ ఇది పూర్తి అయిన వెంటనే ఎన్నికల ప్రకటన విడుదలకానుంది. రిజర్వేషన్లు నిర్ధారించేందుకు వార్డులో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ మహిళా ఓటర్ల గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు సర్వే బృందం మంగళవారం నుంచి ఇంటింటా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలో మున్సిపల్‌, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఓటర్లను ప్రత్యేకంగా విభజించి ఈ జాబితాలను రూపొందించారు. జిల్లాలో కాకినాడ మినహా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని, రామచంద్రపురం, మండపేట, అమలాపురం మున్సిపాలిటీలు ఏలేశ్వరం, ముమ్మిడివరం, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో డీఎంఏ ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఓటర్ల జాబితాను తయారు చేయాల్సి ఉంది. వీటిపై రాజకీయ నాయకుల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం తుది జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ జాబితా రూపొందించడం ద్వారా రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. వీటిని సీడీఎంఏ కార్యాలయానికి పంపి ప్రభుత్వ అనుమతితో అక్కడ నుంచి ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. అన్నీ పరిశీలించి ఒకే చేసిన తర్వాత ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
 
పట్టణాలవారీగా...
రాజమహేంద్రవరం 50 డివిజన్లలో మూడు లక్షల 546 ఓటర్లు ఉండగా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులలో 40వేల066మంది ఓటర్లు ఉన్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ పరిఽధిలో 28వార్డుల్లో 39వేల493మంది ఓటర్లు ఉన్నారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డుల్లో 42562మంది ఓటర్లు ఉన్నారు. తుని మున్సిపాలిటీ పరిధిలో 30వార్డుల్లో 40415మంది ఓటర్లు ఉన్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో 27 వార్డుల్లో 33వేల904మంది ఓటర్లు ఉన్నారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో 29వార్డుల్లో 46వేల859 మంది ఓటర్లు ఉన్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డుల్లో 39619మంది ఓటర్లు ఉన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో 20 వార్డుల్లో 20721 మంది ఓటర్లు ఉన్నారు. ముమ్మిడివరం నగరపంచాయతీ పరిధిలో 20 వార్డుల్లో 20,065 ఓటర్లు ఉన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీల్లో 20వార్డుల్లో 21,409మంది ఓటర్లు ఉన్నారు.
 
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ మహిళా ఓటర్ల గుర్తింపుతోపాటు రిజర్వేషన్ల నిర్ధారణ ప్రక్రియను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో రిజర్వేషన్లకు సంబంధించిన పనులతోపాటు ఎన్నికల ముందు చేపట్టాల్సిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన చేయనున్నారు. ఇందు కు సంబంధించి అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో జిల్లా అధికారులు మున్సిపల్‌ సిబ్బందితో సమావేశమయ్యారు. పర్యవేక్షణకోసం ప్రతి వార్డునకు ఒక సూపర్‌వైజింగ్‌ అధికారిని నియమించారు. మంగళవరం ఇంటింటా సర్వే నిర్వహణ లో సర్వే సిబ్బందికి ఈ సూపర్‌వైజర్లు ప్రత్యేక మార్గదర్శకాల ను నిర్దేశించారు. తొలివిడతగా మహిళా ఓటర్ల విభజన చేపట్టారు. తదుపరి ప్రక్రియలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు 12 రోజులు మాత్రమే సమయాన్ని సర్వే బృందానికి కేటాయించారు. ఆ తర్వాత సిబ్బంది జాబితా రూపకల్పన, అభ్యంతరాల స్వీకరణ తుది జాబితా రూపొందించడం వార్డులవారీ రిజర్వేషన్లు నిర్ణయించడం తదితర పనులన్నింటికి జూన్‌ 17నాటికి పూర్తి చేయాల్సి ఉంది. పురపాలక సంఘాల్లో పనిచేసే సిబ్బందికి సెలవులను సైతం రద్దుచేశారు. సిబ్బంది తక్కువగా ఉన్నా ఎన్నికల పనులను నెలరోజుల్లో పూర్తిచేయాలని సీడీఎంఏ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
 
నెల రోజుల షెడ్యూలు ఇది
మంగళవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు వార్డులవారీగా ఇంటింటా సర్వే చేసిన తర్వాత రెండురోజుల్లో ముసాయిదా జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. సిబ్బంది రూపొందించిన జాబితాలను జూన్‌ 4న విడుదల చేయడంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలవద్ద అందుబాటులో ఉంచాలి. జూ రాజకీయ పార్టీల నేతలు ప్రజలు, ఓటర్లు జాబితాలను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 5 నుంచి 9వరకు ఫిర్యాదులు చేసు కునే వెసులుబాటు ఇస్తారు. ఫిర్యాదులు వస్తే జూన్‌ 10 నుంచి 14 వరకు పరిశీలించడంతోపాటు అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంది. జూ అభ్యంతరాలను 15, 16 తేదీల్లో పరిష్కరించి వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ఓటర్లను ఖరారు చేసి తుది జాబితా రూపకల్పన చేస్తారు. జూ జూన్‌ 17న వార్డులవారీగా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. వీటి ఆ ధారంగా వార్డుల రిజర్వేషన్‌ ప్రక్రియ ఖరారు చేసి పురపాలకశాఖ సీడీఎంఏ కార్యాలయానికి పంపనున్నారు

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.